IPL 2024: హైదరాబాద్‌లో మే 8న ఐపీఎల్ మ్యాచ్.. పేటీఎంలో టికెట్ బుకింగ్స్ ఓపెన్

మే 8న లక్నో, హైదరాబాద్ మ్యాచ్ జరిగిన తర్వాత మరో రెండు మ్యాచులు ఉప్పల్‌లో జరగాల్సి ఉంటుంది.

IPL 2024: హైదరాబాద్‌లో మే 8న ఐపీఎల్ మ్యాచ్.. పేటీఎంలో టికెట్ బుకింగ్స్ ఓపెన్

SRH

IPL 2024 Tickets: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మే 8న జరగబోయే మ్యాచ్ కోసం టికెట్స్ బుకింగ్‌లు పేటీఎంలో ఓపెన్ అయ్యాయి. గత మ్యాచ్‌లతో పోల్చితే తక్కువ రేట్లకే ఐపీఎల్ టికెట్లను అమ్ముతోంది హైదరాబాద్ మేనేజ్‌మెంట్ టీమ్.

ఐపీఎల్ టికెట్లకు క్రేజ్ విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే ఉప్పల్ స్టేడియంలో గత నెల 27న ముంబై, హైదరాబాద్ మ్యాచ్.. ఏప్రిల్ 5న చెన్నై, హైదరాబాద్ మ్యాచ్ జరిగాయి. ఏప్రిల్ 25న బెంగుళూరు, హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. అలాగే, మే 2న రాజస్థాన్, హైదరాబాద్ మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటికే ఈ రెండు మ్యాచ్‌ల టికెట్ల అమ్మకాలు పూర్తయ్యాయి.

ఆర్సీబీ, ఆర్ఆర్ జట్లతో పోల్చితే లక్నో టీమ్‌తో జరుగుతున్న మ్యాచ్ టికెట్ల ధరలను కాస్త తగ్గించారు. కాగా, మే 8న లక్నో, హైదరాబాద్ మ్యాచ్ జరిగిన తర్వాత మరో రెండు మ్యాచులు ఉప్పల్‌లో జరగాల్సి ఉంటుంది. మే 16న గుజరాత్, హైదరాబాద్, మే 19న పంజాబ్, హైదరాబాద్ తలపడతాయి.

కాగా, హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు మొత్తం 6 మ్యాచులు ఆడగా వాటిలో నాలుగు మ్యాచుల్లో గెలిచి, రెండింట్లో ఓడిపోయింది. దీంతో 8 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.

Also Read: అశుతోష్ శర్మ సంచ‌ల‌న ఇన్నింగ్స్ వృథా.. పంజాబ్ పై ముంబై విజ‌యం