PBKS vs MI : అశుతోష్ శర్మ సంచ‌ల‌న ఇన్నింగ్స్ వృథా.. పంజాబ్ పై ముంబై విజ‌యం

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ మూడో విజ‌యాన్ని న‌మోదు చేసింది.

PBKS vs MI : అశుతోష్ శర్మ సంచ‌ల‌న ఇన్నింగ్స్ వృథా.. పంజాబ్ పై ముంబై విజ‌యం

PBKS vs MI

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ మూడో విజ‌యాన్ని న‌మోదు చేసింది. ముల్లన్‌పూర్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 9 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. 193 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పంజాబ్ జ‌ట్టు 19.1 ఓవ‌ర్‌లో 183 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో అశుతోష్ శర్మ (61; 28 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శ‌శాంక్ సింగ్ (41; 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) రాణించాడు. ముంబై బౌల‌ర్ల‌లో బుమ్రా, గెరాల్డ్ కోయెట్జీ చెరో మూడు వికెట్లు తీశారు. శ్రేయాస్ గోపాల్, ఆకాశ్ మ‌ధ్వాల్, హార్దిక్ పాండ్యలు త‌లా ఓ వికెట్ సాధించారు.

అంత‌క ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి 192 ప‌రుగులు చేసింది. ముంబై బ్యాట‌ర్ల‌లో సూర్యకుమార్ యాదవ్( 78; 53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేయ‌గా తిల‌క్ వ‌ర్మ (34 నాటౌట్; 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), రోహిత్ శ‌ర్మ (36; 25 బంతుల్లో 2ఫోర్లు, 3సిక్స‌ర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీశాడు. సామ్ కరణ్ రెండు వికెట్లు తీయగా కగిసో రబడా ఓ వికెట్ పడగొట్టాడు.

Rohit Sharma : ఐపీఎల్‌లో రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త‌.. ఎలైట్ క్ల‌బ్‌లో ధోని స‌ర‌స‌న‌..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు శుభారంభం ల‌భించ‌లేదు. ఇషాన్ కిష‌న్ (8) విఫ‌లం కావ‌డంతో 18 ప‌రుగుల వ‌ద్ద ముంబై తొలి వికెట్ కోల్పోయింది. వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన సూర్య‌కుమార్ యాద‌వ్‌తో క‌లిసి హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ చెల‌రేగాడు. దీంతో పవర్ ప్లేలో ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. రోహిత్‌తో పాటు సూర్య సైతం దంచికొట్ట‌డంతో స్కోరు బోర్డు ప‌రుగులు పెట్టింది.

ప్ర‌మాద‌క‌రంగా మారిన ఈ జోడీని రోహిత్ శ‌ర్మ‌ను ఔట్ చేయ‌డం ద్వారా సామ్ క‌ర్రాన్ విడ‌దీశాడు. రోహిత్-సూర్య జోడి రెండో వికెట్‌కు 81 ప‌రుగులు జోడించారు. హిట్‌మ్యాన్ ఔటైనా కానీ పంజాబ్‌కు ఉప‌శ‌మ‌నం ల‌భించ‌లేదు. అగ్నికి వాయువు తోడు అయిన‌ట్లు సూర్య‌కు తిల‌క్ వ‌ర్మ జ‌త‌క‌లిశాడు. సూర్య 34 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. సెంచ‌రీ దిశ‌గా సాగుతున్న సూర్య ఇన్నింగ్స్ కు సామ్ క‌ర్రాన్ బ్రేక్ వేశాడు.

Rohit Sharma : ధోనిని ఒప్పించ‌డం చాలా క‌ష్టం.. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం జ‌ట్టును ఎంపిక చేయ‌లేదు : రోహిత్ శ‌ర్మ‌

ధాటిగా ఆడే క్ర‌మంలో హార్దిక్ పాండ్యా(10), టీమ్ డేవిడ్(14) ఔటైన ఇన్నింగ్స్ ఆఖ‌రి వ‌ర‌కు నిలిచి జ‌ట్టుకు భారీ స్కోరు అందించాడు తిల‌క్‌వ‌ర్మ‌.