Rohit Sharma : ఐపీఎల్‌లో రోహిత్ శర్మ అరుదైన ఘనత.. ఎలైట్ క్లబ్‌లో ధోని సరసన..
టీమ్ఇండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.

Rohit Sharma 2nd player after MS Dhoni to play 250 matches in IPL
Rohit Sharma 250 IPL matches : టీమ్ఇండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 250 మ్యాచులు ఆడిన రెండో ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ముల్లన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌తో రోహిత్ ఈ ఘనతను అందుకున్నాడు. రోహిత్ కంటే ముందు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మాత్రమే ఐపీఎల్‌లో రెండు వందల యాభైకి పైగా మ్యాచులు ఆడాడు.
ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచులు ఆడిన ఆటగాళ్ల జాబితా..
ఎంఎస్ ధోని – 256 మ్యాచులు
రోహిత్ శర్మ – 250 మ్యాచులు
దినేశ్ కార్తీక్ – 249 మ్యాచులు
విరాట్ కోహ్లి – 244 మ్యాచులు
రవీంద్ర జడేజా – 232 మ్యాచులు
Virat Kohli : విరాట్ కోహ్లికి అరుదైన గౌరవం.. జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో మైనపు విగ్రహాం
రోహిత్ శర్మ 2008లో డెక్కర్ ఛార్జర్స్ తరుపున తన ఐపీఎల్ కెరీర్ ను ఆరంభించాడు. మూడు సీజన్ల పాటు ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 45 మ్యాచుల్లో 1170 పరుగులు చేశాడు. ఆ తరువాత ముంబై ఇండియన్స్‌కు వెళ్లాడు. ముంబై తరుపున 245 మ్యాచులు ఆడి 5344 పరుగులు చేశాడు.
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ విషయానికి వస్తే.. 25 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 2 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 36 పరుగులు చేశాడు.
Star Sports special poster for Rohit Sharma ⭐? pic.twitter.com/PC5eYA7Ygf
— Johns. (@CricCrazyJohns) April 18, 2024