తెలంగాణ వ్యాప్తంగా జోరువానలు కురిసే అవకాశం.. ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గాయి.

Telangana Rain alert

భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలకూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. హైదరాబాద్‌ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో గంటకు 30 – 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది.

తెలంగాణలో వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు తక్కువగా రికార్డవుతాయని తెలిపింది. రాగల 2-3 రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రంతో పాటు మాల్దీవులు, దక్షిణ, మధ్య బంగాళాఖాతంలోని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని పేర్కొంది.

Also Read: ఐపీఎల్‌ చరిత్రలో ఏ కెప్టెన్‌ సాధించలేని ఘనతను సాధించి.. హిస్టరీ క్రియేట్ చేసిన శ్రేయాస్ అయ్యర్

కాగా, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండగా, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. నిన్న జోగులాంబ, మహబూబ్​నగర్, గద్వాల, వనపర్తి, నాగర్​కర్నూల్, నారాయణపేట, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురిశాయి. తెలంగాణ వ్యాప్తంగా నిన్న ఉష్ణోగ్రతలు తగ్గాయి. తెలంగాణలోని 4 జిల్లాల్లో (జగిత్యాల, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్​, నిర్మల్) మాత్రమే 40 డిగ్రీలకంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలోని మిగతా అన్ని జిల్లాల్లో 40 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.