ఐపీఎల్‌ చరిత్రలో ఏ కెప్టెన్‌ సాధించలేని ఘనతను సాధించి.. హిస్టరీ క్రియేట్ చేసిన శ్రేయాస్ అయ్యర్

ధోనీ వంటి ఆటగాడికి కూడా దక్కని ఘనత శ్రేయాస్ అయ్యర్‌కు దక్కింది. 

ఐపీఎల్‌ చరిత్రలో ఏ కెప్టెన్‌ సాధించలేని ఘనతను సాధించి.. హిస్టరీ క్రియేట్ చేసిన శ్రేయాస్ అయ్యర్

Updated On : May 19, 2025 / 8:03 AM IST

ఐపీఎల్‌ చరిత్రలో 3 టీమ్స్‌ను ప్లేఆఫ్స్‌కు చేర్చిన మొట్టమొదటి కెప్టెన్‌గా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఐపీఎల్‌ 2025లో భాగంగా నిన్న రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే.

ఈ మ్యాచులో పంజాబ్‌ టీమ్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో 17 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి, ప్లేఆఫ్స్‌ చేరింది. గతంలో శ్రేయాస్‌ అయ్యర్ 2015–2021 మధ్య ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున, 2022–2024 మధ్య కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడాడు.

Also Read: ఇక ఫ్యాన్స్‌ దృష్టంతా ప్లేఆఫ్స్‌పైనే.. ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లేఆఫ్స్‌కు వెళ్తుందా? ఇలా జరిగితేనే ఛాన్స్‌.. లేదంటే..

ఐపీఎల్‌ 2024లో కేకేఆర్‌‌ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ ఆ జట్టును ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్తాడు. ఆ సీజన్‌ టైటిల్ విజేత కూడా కేకేఆరే. అలాగే, ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా ఉన్న సమయంలోనూ శ్రేయాస్‌ అయ్యర్‌ ఆ టీమ్‌ను ప్లేఆఫ్స్‌ వరకు తీసుకెళ్లాడు.

ఇప్పుడు పంజాబ్ కింగ్స్‌ కెప్టెన్‌గా ఆ జట్టును ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లడంతో మొత్తం మూడు టీమ్స్‌ను ప్లే ఆఫ్స్‌కు చేర్చిన సారథిగా రికార్డు సృష్టించాడు. ఇతర ఏ కెప్టెన్‌ కూడా ఇటువంటి ఘనత సాధించలేదు. కాగా, పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు 11 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు చేరింది. ధోనీ వంటి వారికి కూడా దక్కని ఘనత శ్రేయాస్ అయ్యర్‌కు దక్కింది.

కాగా, నిన్న మ్యాచులో గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఢిల్లీ ఓడిపోవడంతో ప్లేఆఫ్స్‌లోకి గుజరాత్, బెంగళూరు, పంజాబ్‌ ప్రవేశించాయి. ప్లేఆఫ్స్‌లో చోటు కోసం ఇక పోటీ అంతా ముంబై, ఢిల్లీ, లక్నో జట్ల మధ్యే ఉంటుంది.