Playing Poker In Jubilee Hills : జూబ్లీహిల్స్‌లో పేకాట శిబిరాలపై టాస్క్‌ ఫోర్స్‌ దాడులు..13 మంది అరెస్టు

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో పేకాట శిబిరంపై వెస్ట్‌జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ సిబ్బంది దాడులు నిర్వహించారు. పెద్దమ్మతల్లి టెంపుల్‌ వెనుక తాళ్లూరి బలరామయ్య, బోలినేని సీనయ్య ఇళ్లలో పేకాట ఆడుతున్న 13 మందిని అదుపులోకి తీసుకున్నారు.

Playing Poker In Jubilee Hills

playing poker in Jubilee Hills : హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో పేకాట శిబిరంపై వెస్ట్‌జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ సిబ్బంది దాడులు నిర్వహించారు. పెద్దమ్మతల్లి టెంపుల్‌ వెనుక తాళ్లూరి బలరామయ్య, బోలినేని సీనయ్య ఇళ్లలో పేకాట ఆడుతున్న 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు.

జూబ్లీహిల్స్ లోని బొల్లినేని బలరామయ్య నివాసంలో పేకాట ఆడుతున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు ఆ ఇంటిపై మంగళవారం దాడి చేశారు. ఈ సమయంలో బలరామయ్య ఇంట్లో పేకాట ఆడుతున్న 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేకాట క్లబ్ లు మూసివేశారు.

Andhra pradesh: పేకాట ఆడుతూ చిక్కిన 10 మంది.. వారిలో ఇద్ద‌రు పోలీసులు

ప్రభుత్వ నిర్ణయంతో చాటుమాటుగా అక్కడక్కడా పేకాట నిర్వహిస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ శివార్లలోని ఫామ్ హౌస్ లను కేంద్రంగా చేసుకుని పేకాట నిర్వహించిన వారిని పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు. ఫామ్ హౌస్ లతో పాటు స్టార్ హోటల్స్ ను అద్దెకు తీసుకొని పేకాట నిర్వహించిన వారిపై గతంలోనే తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు.