Indiramma abhaya hastham: తెలంగాణలోని పేదలకు నిత్యావసర సరుకుల కిట్..!​

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సన్నబియ్యం పంపిణీని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది.

తెలంగాణలోని పేదలకు సన్నబియ్యంతో పాటు నిత్యావసర సరుకుల కిట్​ను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్‌ సర్కారు యోచిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమ్మ హస్తం పేరుతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

ప్రతి నెలా తొమ్మిది ముఖ్యమైన ఆహార వస్తువులను సబ్సిడీతో రూ.185కు అప్పట్లో అందించేవారు. అప్పట్లో ఈ పథకాన్ని 2013 ఏప్రిల్లో ఉగాది రోజు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విశాఖపట్నం వద్ద ప్రారంభించారు.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా? 

అటువంటి పథకాన్నే మళ్లీ ఇప్పుడు తెలంగాణలో ప్రారంభించాలని రేవంత్ రెడ్డి సర్కారు భావిస్తోంది. ఈ పథకానికి ఇందిరమ్మ అభయహస్తం పేరును పెట్టనున్నారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు వేసుకుంటోంది. పేద కుటుంబాలకు మంచినూనెతో పాటు కందిపప్పు, పంచదార తదితర నిత్యావసర సరుకులు ఇచ్చే అవకాశం ఉంది.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సన్నబియ్యం పంపిణీని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది. నిన్న ఒక్కరోజే తెలంగాణలో 8.30 లక్షల ఫ్యామిలీలకు 17,311 రేషన్​ షాపుల్లో సుమారు 18 వేల టన్నుల బియ్యాన్ని పంపిణీ చేశారు.