Gold: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,14,000గా ఉంది

కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. ఇవాళ ఉదయం 11 గంటల నాటికి బంగారం ధరల్లో నిన్నటితో పోల్చితే ఎలాంటి మార్పు కనపడలేదు.
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పసిడి ధరలు రూ.85 వేల మార్కును దాటాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.85,100గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,840గా ఉంది.

Gold
ఢిల్లీ, ముంబైలో..
- ఢిల్లీలో బంగారం 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.85,250గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,990గా ఉంది.
- ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.85,100గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,840గా ఉంది.
వెండి ధరలు
దేశంలో వెండి ధరల్లో ఇవాళ ఉదయం నాటికి ఎలాంటి మార్పులేదు. వివిధ నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
- హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,14,000గా ఉంది
- విజయవాడలో కిలో వెండి ధర రూ.1,14,000గా ఉంది
- విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.1,14,000గా ఉంది
- ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,05,000గా ఉంది
- ముంబైలో కిలో వెండి రూ.1,05,000గా ఉంది
NOTE: బంగారం ధరల్లో గంటల వ్యవధిలో మార్పులు చోటుచేసుకుంటాయి. కస్టమర్లు బంగారం కొనే సమయం నాటికి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుని కొంటే మంచింది.