Kavitha : కవిత ప్రశాంత్‌రెడ్డిని టార్గెట్ చేయడానికి రీజన్ అదేనా.? సడెన్‌గా హరీశ్‌పై సాఫ్ట్‌‌కార్నర్‌ ఎందుకు..!

Kavitha : కవిత ప్రశాంత్‌రెడ్డిని టార్గెట్‌ చేయడం వెనుక ఆమె లక్ష్యమేంటన్న చర్చ మొదలైంది.

Kavitha, prashanth reddy

Kavitha : తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత..బీఆర్ఎస్‌కు దూరం అయినప్పటి నుంచి ఎప్పటికప్పుడు తన టార్గెట్‌ను మారుస్తూ వస్తున్నారు. బీఆర్ఎస్‌లో తనకు అన్యాయం జరిగిందన్న మాటనే బలంగా వినిపిస్తున్న కవిత..పార్టీ తనను దూరం పెట్టడానికి..తన తండ్రి కేసీఆర్‌కు తనకు గ్యాప్ పెంచడానికి కారణం..వాళ్లే అంటూ పలువురు లీడర్లపై బాణాలు ఎక్కుపెడుతు వస్తున్నారు. మొన్నటి వరకు జోగినపల్లి సంతోష్‌ను టార్గెట్‌ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత గుంటనక్క అంటూ హరీశ్‌పై అటాక్‌ చేశారు. అటు కేటీఆర్‌ను అప్పుడప్పుగు గట్టిగానే విమర్శిస్తున్నారు. లేటెస్ట్‌గా ఇందూరు సభలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డే తన రాజకీయ ప్రత్యర్థి అన్నట్లుగా మాట్లాడుకొచ్చారు కవిత. దీంతో ఆమె టార్గెట్ మారినట్లే కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది.

Also Read : Trump Dollar Ccoins : ట్రంప్ ఫొటోతో అమెరికా కొత్త నాణెం.. గంటల్లోనే స్టాక్ ఖాళీ! దీని ప్రత్యేకతలు ఏమిటంటే

కవిత ప్రశాంత్‌రెడ్డిని టార్గెట్‌ చేయడం వెనుక ఆమె లక్ష్యమేంటన్న చర్చ మొదలైంది. కేసీఆర్‌తో తనకు దూరం పెరగడానికి ప్రశాంత్‌రెడ్డే కారణమన్నది కవిత ఆరోపణ. తండ్రీకూతుళ్ల మధ్య చిచ్చు పెట్టారని విమర్శిస్తూ..మహాభారతంలోని శకునితో పోల్చుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంటే..కవిత రాజకీయ కథనంలో ప్రశాంత్‌రెడ్డిని ఒక కీలక పాత్రగా చూపించే ప్రయత్నం జరుగుతోందా.? ఇంతకాలం హరీశ్‌రావు చుట్టూ తిరిగిన వివాదం..ప్రశాంత్‌రెడ్డి వైపు తిరగడానికి కారణమేంటన్నది డిస్కషన్‌కు దారితీస్తోంది.

ప్రశాంత్‌ రెడ్డిని టార్గెట్‌ చేయడానికి కవిత ఇందూరునే వేదికగా చేసుకున్నారు. అక్కడే సభలు పెడుతూ..రాజకీయ భవిష్యత్‌పై సంకేతాలు ఇస్తూ వస్తున్న కవిత.. అదే నిజామాబాద్ కేంద్రంగా ప్రశాంత్‌రెడ్డిపై నేరుగా విమర్శలు చేశారు. బీఆర్ఎస్‌లో అన్యాయం చేశారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో కవిత కన్నీళ్లపై కూడా రాజకీయ చర్చ మొదలైంది. ఇది ఆమె వ్యక్తిగత ఆవేదనా.? లేక ప్రజల్లో సానుభూతిని పెంచుకునే రాజకీయ వ్యూహమా.? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

పాలిటిక్స్‌లో సెంటిమెంట్‌ కూడా ఒక బలమైన ఆయుధమే. ఒక నాయకుడికి అన్యాయం జరిగిందన్న భావనను ప్రజల్లో బలంగా నాటగలిగితే..అది రాజకీయంగా సానుభూతిగా మారే అవకాశం ఉంటుంది. కవిత కూడా సానుభూతి కార్డుతోనే బీఆర్ఎస్‌ను బ్లేమ్‌ చేసే ప్లాన్‌లో ఉన్నారా అనే డిస్కషన్ నడుస్తోంది.

అయితే కవిత ప్రశాంత్‌రెడ్డిని టార్గెట్ చేయడం వెనుక అసలు లెక్క వేరే ఉందట. అమ్మగారింట్లో అన్యాయం జరిగితే..అత్తగారిళ్లు అయిన ఇందూరుకు వచ్చానంటూ కవిత సెంటిమెంట్‌ కార్డును ప్లే చేస్తూ వస్తున్నారు. పోగోట్టుకున్న చోటే వెతుక్కునే ప్రయత్నంలో ఉన్న ఆమె ఇందూరులో తన సత్తా చాటేందుకు పావులు కదుతున్నారు. ఈ క్రమంలోనే నిజామాబాద్ బీఆర్ఎస్‌ నుంచి భారీగా చేరికలు చేసుకోవాలని కవిత పావులు కదిపారట. ఈ విషయాన్ని ముందే గ్రహించిన ప్రశాంత్‌రెడ్డి..అలర్ట్ అయ్యారట.

ఇందూరు జిల్లాల్లో బీఆర్ఎస్‌లో ఉన్న ఏకైక ఎమ్మెల్యేగా..అక్కడి లీడర్లకు పెద్దదిక్కుగా నిలుస్తున్న ప్రశాంత్‌రెడ్డి..కవిత పార్టీలో చేరికలు జరగకుండా అడ్డుకున్నారట. కవిత ఎవరెవరిని అయితే చేర్చుకోవాలనున్నారో వాళ్లందరికి నచ్చజెప్పి తెలంగాణ రక్షణ సేన పార్టీలోకి వెళ్లకుండా బ్రేకులు వేశారట. ఇదే కవిత కోపానికి..ప్రశాంత్‌రెడ్డిని టార్గెట్ చేయడానికి మెయిన్ రీజన్‌గా చెబుతున్నారు గులాబీ లీడర్లు. ఇందూరు జిల్లాల్లో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ ఇవ్వాలనుకున్న కవితకు..తొలి ప్రయత్నాల్లోనే ప్రశాంత్‌రెడ్డి చెక్‌ పెట్టడంతో ఆమె షాకయ్యారని..అందుకే ప్రశాంత్‌రెడ్డిపై అటాక్ చేస్తున్నారని చర్చించుకుంటున్నారు కారు పార్టీ నేతలు.

అయితే కవిత హరీశ్‌రావుపై సాఫ్ట్‌ లైన్‌ తీసుకోవడం కూడా రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఇంతకాలం హరీశ్‌రావునే టార్గెట్ చేస్తూ వచ్చిన కవిత..ఇప్పుడు ఆయనను క్షమించే అవకాశం ఉందన్న సంకేతాలు ఇవ్వడం వెనుక ఏదైనా రాజకీయ లెక్క ఉందా.? తన పోరాటం హరీశ్‌రావుతో కాదని..తనకు రాజకీయంగా నష్టం చేసిన వ్యక్తులపై మాత్రమేనని చెప్పే ప్రయత్నమా.? అన్న చర్చ జరుగుతోంది. ప్రశాంత్‌రెడ్డిని ప్రధాన టార్గెట్‌గా నిలబెట్టడం వెనుక కవిత వ్యూహం ఏంటనేది పొలిటికల్‌ హాట్ టాపిక్‌గా మారింది.