Political fight now about who is bigger Hindu than PM Modi: Owaisi
India-China face off: భారత్-చైనా సైనికుల మధ్య అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో ఈ నెల 9న ఘర్షణ చోటుచేసుకున్న నేపథ్యంలో దీనిపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మరోసారి స్పందించారు. చైనా ఆర్మీ ఈ ఏడాది వేసవికాలం నుంచి అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో బహిరంగంగానే అన్ని ఒప్పందాలనూ ఉల్లంఘిస్తూ దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని, ఇరు దేశాల మధ్య ఘర్షణలు పదేపదే జరుగుతున్నాయని వచ్చిన ఓ వార్తను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
‘‘దేశ ప్రజలను, పార్లమెంటును ప్రధాని మోదీ ప్రభుత్వం మభ్యపెట్టింది. చైనా దుందుడుకు చర్యలపై నిజాలు చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది. చైనా పాల్పడుతున్న చర్యలను దాచిపెట్టడం వెనుక మోదీకి చేకూరుతున్న ప్రయోజనం ఏంటీ?’’ అని ఆయన ప్రశ్నించారు.
చైనా దుశ్చర్యలపై, కేంద్ర ప్రభుత్వ తీరుపై పార్లమెంటులో చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. మోదీ అనేక విషయాలను దాచుతున్నారని, పార్లమెంటులో అన్ని వివరాలను ఆయన తెలపాలని అన్నారు. ప్రజలకు నిజాలు చెప్పకుండా దాచి పెట్టడందేనికని ఆయన నిలదీశారు. చైనా చర్యలపై మీడియాలో వచ్చిన కథనాలు నిజమైతే సరిహద్దుల వద్ద సమస్య మనం ఊహిస్తున్న దాని కంటే అధికంగానే ఉన్నట్లు అని చెప్పారు. అన్ని విషయాలపై కేంద్ర ప్రభుత్వం నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Raghuram Rajan: అందుకే దేశంలో నిరుద్యోగం: రాహుల్‌తో రఘురామ్ రాజన్