Raja Singh : హైదరాబాద్‌లో ప్రధాని మోదీ సభకు ఎమ్మెల్యే రాజాసింగ్ ఎందుకు రాలేదు? అసలేం జరిగింది?

Raja Singh : ఇంతకీ రాజాసింగ్ కు ఆహ్వానం అందిందా లేదా? రాజాసింగ్ ను పక్కన పెట్టడానికి కారణాలు ఏంటి? అనే డిస్కషన్ నడుస్తోంది.

Raja Singh On Modi Meeting (Photo : Google)

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీసీ ఆత్మగౌరవ సభ పేరుతో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. అలాగే బీజేపీ ముఖ్య, కీలక నాయకులు అంతా తరలివచ్చారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ తదితర నేతలు సభలో కనిపించారు. ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ప్రధాని మీటింగ్ లో పాల్గొన్నారు. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

అయితే, ఈ సభలో గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎక్కడా కనిపించలేదు. అసలు రాజాసింగ్ ఈ సభకు హాజరే కాలేదు. దీంతో ఈ అంశం బీజేపీ శ్రేణుల్లో, రాజాసింగ్ అభిమానులు, మద్దతుదారుల్లో చర్చనీయాంశంగా మారింది. రాజాసింగ్.. ప్రధాని మోదీ సభకు ఎందుకు రాలేదు? కారణం ఏంటి? అసలేం జరిగింది? ఇంతకీ రాజాసింగ్ కు ఆహ్వానం అందిందా లేదా? రాజాసింగ్ ను పక్కన పెట్టారా? అలా పెట్టడానికి కారణాలు ఏంటి? అనే డిస్కషన్ నడుస్తోంది.

ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోదీ సభకు హాజరుకాకపోవడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఎల్బీ స్టేడియంలో బీజేపీ సభను కార్యకర్తలతో కలిసి టీవీలో చూశానని రాజాసింగ్ తెలిపారు. నరేంద్ర మోదీ, బీజేపీ బీసీ సభను ఇలా టీవీలో చూడటం తనకు బాధ కలిగించిందన్నారు. అయితే, ఈ సభకు హాజరుకాకపోవడానికి కారణం ఏంటో రాజాసింగ్ వివరించారు.

Also Read : బలమైన నాయకుడు, దేశ ప్రయోజనాలే ముఖ్యం- ప్రధాని మోదీపై పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం

”బీజేపీ సభ జరిగిన ఎల్బీ స్టేడియం నా నియోజకవర్గంలో ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేశాను. కనుక ఆ సభలో నేను పాల్గొంటే ఆ సభ ఖర్చు అంతా నా ఖాతాలో రాసే అవకాశం ఉంది. ఈ అంశంపై పార్టీ నేతలు, కేంద్ర ఎన్నికల కమిషన్ తో నేను మాట్లాడాను. వారు కూడా అదే చెప్పారు. మా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా అదే వివరించారు. దాంతో నేనా సభకు హాజరు కాలేదు. కానీ, మా గురువు గారు నరేంద్రమోదీ పాల్గొన్న సభలో నేను పాల్గొన లేకపోవడం చాలా బాధగా ఉంది” అని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.

Also Read : తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే, మాతో పవన్ కల్యాణ్ ఉన్నారు- ప్రధాని మోదీ

ట్రెండింగ్ వార్తలు