స్మితా సబర్వాల్‌పై బదిలీ వేటు.. కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తారా?
హై లెవల్ ఆఫీసర్‌గా.. కీర్తిప్రతిష్టలు తెచ్చుకొని కేసీఆర్‌తో ప్రశంసలు అందుకున్న ఆమె.. ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరికీ బదిలీ కావటం హాట్ టాపిక్‌గా మారింది.
- Naga Srinivasa Rao Poduri
- Published On : January 4, 2024 / 10:25 AM IST
Why Smita Sabharwal transferred out of Telangana CMO details inside
Smita Sabharwal: స్మితా సబర్వాల్.. గత BRS సర్కార్‌లో సీఎంవోలో కీలక అధికారి. మాజీ సీఎం కేసీఆర్.. స్మితా సబర్వాల్‌కు ఎనలేని ప్రాదాన్యత ఇవ్వడంతో.. తొమ్మిదిన్నరేళ్ల పాటు ఆమె CMO కేంద్రంగా చక్రం తిప్పారు. ఎంతలా అంటే.. ఫీల్డ్ విజిట్‌లను ప్రత్యేక హెలీకాప్టర్‌లో వెళ్లి చేసేంత ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే.. రేవంత్ సర్కార్ బదిలీ వేటుతో.. స్మితాను లూప్ లైన్ పోస్టుకు పరిమితం చేసింది. దీంతో స్మితా సబర్వాల్ బదిలీ IAS సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
సీఎం రేవంత్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టాక బదిలీల పరంపర కొనసాగుతూనే ఉంది. పరిపాలనలో తన పట్టు పెంచుకునే విధంగా.. ఆఫీసర్స్ టీమ్‌ను ఎంచుకుంటున్నారు రేవంత్. ఇందులో భాగంగా ఇప్పటికే.. గత ప్రభుత్వంలో.. కేసీఆర్‌కు విశ్వాస పాత్రులుగా పనిచేసిన సలహాదారులను రేవంత్ రెడ్డి తొలగించారు. తాజాగా 26 మంది IASలను బదిలీ చేశారు. ఇందులో స్మితా సబర్వాల్‌ను ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా ట్రాన్స్‌ఫర్ చేయడం చర్చనీయాంశం అయ్యింది.
యంగ్ డైనమిక్ అధికారిగా ప్రశంసలు
KCR ప్రభుత్వంలో యంగ్ డైనమిక్ అధికారిగా స్మితా సబర్వాల్ ప్రశంసలు అందుకున్నారు. అంతేకాదు, కేసీఆర్‌కు అత్యంత విశ్వాసపాత్రురాలిగా పేరు సంపాదించారు. ఉద్యమ సమయంలో మెదక్ కలెక్టర్‌గా ఆమె పెట్టిన కన్నీళ్లే.. కేసీఆర్ స్మితాను CMOలోకి తీసుకోవడానికి కారణమనే చర్చ ఉంది. ఇక సీఎం సెక్రటరీగా ఎంట్రీ ఇచ్చిన స్మితా సబర్వాల్.. KCR కోటరీలో కీలకంగా మారిపోయారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్, పిఆర్ అండ్ RD, మిషన్ భగీరథలకు పనిచేస్తూ గులాబీ బాస్ డ్రీమ్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరానికి ప్రత్యేక పర్యవేక్షణ అధికారిగా పనిచేశారు. తొమ్మిదిన్నరేళ్లు గత సర్కార్‌లో వెలుగు వెలిగారు. దీంతో ఆమెకు ఎదురుచెప్పే అధికారి లేకుండాపోయారు. సీనియర్ IASలను ఆమె లైట్ తీసుకునేవారన్న ఆరోపణలు ఉన్నాయి.
Also Read: కాళేశ్వరం అవినీతిపై జ్యుడీషియల్ విచారణ చేసి తీరతాం- సీఎం రేవంత్ రెడ్డి
హాట్ టాపిక్‌గా స్మితా సబర్వాల్ బదిలీ
ఫీల్డ్ విజిట్‌లకు కూడా ప్రత్యేక హెలికాప్టర్ వాడేంత స్వేచ్ఛ స్మితా సబర్వాల్‌కు ఉండటం.. ఆమెపై విమర్శలకు తావిచ్చింది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ నిత్యం వార్తల్లో ఉండేవారు. హ్యాంగ్ ఔట్, ఫారెన్ టూర్, ఫేజ్ త్రీ పార్టీలతో ట్రెండ్ అయ్యేవారు. అప్పట్లో ఆమె ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి వచ్చారని.. CMO అధికారికే రక్షణ లేకుండా పోయిందని స్మితా చేసిన ట్వీట్ పొలిటికల్‌గా సంచలనం రేపింది. ఇలా అధికారిక పర్యటనలతో పాటు పర్సనల్ లైఫ్‌లో అందరి అటెన్షన్‌ను డైవర్ట్ చేసే ఆఫీసర్‌గా స్మితా సబర్వాల్ నిలిచారు. ఇలా హై లెవల్ ఆఫీసర్‌గా.. కీర్తిప్రతిష్టలు తెచ్చుకొని కేసీఆర్‌తో ప్రశంసలు అందుకున్న ఆమె.. ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరికీ బదిలీ కావటం హాట్ టాపిక్‌గా మారింది.
Smita Sabharwal transferred
కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తారా?
రాష్ట్రంలో BRS ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో.. స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తారన్న ప్రచారం జరిగింది. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆమె వ్యవహరించిన తీరు బలం చేకూర్చింది. సీఎం ఎవరైనా IASలు వారిని మర్యాద పూర్వాకంగా కలుస్తారు. కానీ, నెలరోజులు దాటినా స్మితా సబర్వాల్ ఇప్పటివరకు రేవంత్‌ను కలవకపోవడంతో.. IAS సర్కిల్లో చర్చనీయాంశంలగా మారింది. అయినా ఆమె లైట్ తీసుకున్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి బదిలీ వేటుతో.. స్మితాను లూప్ లైన్ పోస్ట్‌కు ట్రాన్సఫర్ చేశారు.
Also Read: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బండి సంజయ్‌కు కీలక పదవి ఇచ్చిన బీజేపీ
గత ప్రభుత్వంలో అంతా తానై కేసీఆర్‌కు నీడలా ఉండి చక్రం తిప్పిన స్మితా సబర్వాల్ ఇప్పుడు అప్రధాన్య పోస్ట్‌కు పరిమితం అయ్యారు. అయితే స్మితా ఈ పోస్టులో ఇక్కడే కొనసాగుతారో.. లేదా కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తారో చూడాలి.
