CM KCR
CM KCR President Draupadi Murmu : నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. శీతాకాల విడిది కోసం ఆమె హైదరాబాద్ కు వస్తున్నారు. ఐదురోజుల పాటు రాష్ట్రపతి నగరంలోనే ఉండనున్నారు. సికింద్రాబాద్ బొల్లారంలోని ఉన్న రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. ఈ నెల 30వరకు ఆమె ఇక్కడే ఉండనున్నారు. వివిధ కార్యక్రమాల్లో ముర్ము పాల్గొంటారు. అయితే మొదటి రోజు రాష్ట్రపతి ముర్ముకు విమానాశ్రయంలో సీఎం కేసీఆర్ స్వాగతం చెబుతారా? లేదా అన్న సందేహాలు అందిరిలోనూ నెలకొన్నాయి. గతంలో ఏ రాష్ట్రపతి వచ్చినా సీఎం కేసీఆర్ ఆహ్వానం పలికారు. ప్రణబ్ ముఖర్జీ, రామ్ నాథ్ కోవింద్ వచ్చినప్పుడు సీఎం కేసీఆరే స్వయంగా వెళ్లి వెల్ కమ్ చెప్పారు.
అయితే కేంద్రంలోని బీజేపీతో పోరాటం చేస్తున్న సీఎం కేసీఆర్.. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వలేదు. ప్రతిపక్షాలు నిలబెట్టిన అభ్యర్థికి ఆయన మద్దతు ఇచ్చారు. హైదరాబాద్ కు వస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం చెబుతారా లేదా అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. ఆమెకు సీఎం కేసీఆర్ వెల్ కమ్ చేప్తారా లేక ముఖం చాటేస్తారా అన్నది అంతు చిక్కడం లేదు.
ఇవాళ సాయంత్రం గవర్నర్ ఇచ్చే విందుకు రాష్ట్రపతి హజరవుతారు. ఈ కార్యక్రమానికి సైతం సీఎం కేసీఆర్ వెళ్తారా లేదా అన్న సందిగ్థత నెలకొంది. తమిళిసై మాత్రం సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ఇతర ప్రజా ప్రతినిధులకు ఆహ్వానం పలికారు. అయితే రాష్ట్రపతి ముర్ముకు, స్వాగతం పలకడం, గవర్నర్ ఇచ్చే విందులో పాల్గొనడంపై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి రేపుతోంది.