Draupadi Murmu Winter Vacation : నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఐదు రోజులపాటు శీతాకాల విడిది

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ కు రానున్నారు. శీతాకాల విడిది కోసం ఆమె ఇవాళ నగరానికి రాబోతున్నారు. ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రపతి నగరంలోనే ఉండనున్నారు. రాష్ట్రపతి పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Draupadi Murmu Winter Vacation : నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఐదు రోజులపాటు శీతాకాల విడిది

PRESIDENT

Draupadi Murmu Winter Vacation : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ కు రానున్నారు. శీతాకాల విడిది కోసం ఆమె ఇవాళ నగరానికి రాబోతున్నారు. ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రపతి నగరంలోనే ఉండనున్నారు. రాష్ట్రపతి పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పటిష్ట భద్రత కల్పించారు. సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము బస చేయనున్నారు.

రాష్ట్రపతి నిలయంలోపల ఉన్న 6 భవనాలు, బయట ఉన్న మరో 14 భవనాలు, చుట్టూ పక్కలున్న ప్రాంతాలు, ఉద్యానవనాలను సుందరంగా ముస్తాబు చేశారు. ఈ ప్రాంతంలో రహదారులను బాగు చేయడంతోపాటు మంచి నీటి సౌకర్యం కల్పించారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఇప్పటికే ఢిల్లీ నుంచి ఒక బృందం ఇక్కడికి వచ్చింది.

President Draupadi Murmu : డిసెంబర్ 28న ప్రసాద్ పథకాన్ని ప్రారంభించనున్న రాష్ట్రపతి

రాష్ట్రపతి భద్రతతోపాటు ఇతర ఏర్పాట్లను పరిశీలించింది. ఈ ప్రాంతాన్ని ప్రత్యేక బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. బొల్లారం-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక బలగాలను మోమరించి పటిష్ట భద్రత కల్పించారు. రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఈ ప్రాంతంలో పలు ఆంక్షలు విధించారు. పాసులున్న వారిని మాత్రమే రాష్ట్రపతి భవన్ లోకి అనుమతిస్తారు.

రాష్ట్రపతి ప్రయాణించే మార్గానికి సంబంధించి 40 కార్లతో కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించారు. రాష్ట్రపతి ముర్ము వచ్చే విమానం ల్యాండ్ అయ్యే హకీంపేట ఎయిర్ పోర్టును కూడా అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రాష్ట్రపతి నిలయం, కాన్వాయ్ మార్గం, ఎయిర్ పోర్టు వంటి అన్ని ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు.