President Draupadi Murmu : డిసెంబర్ 28న ప్రసాద్ పథకాన్ని ప్రారంభించనున్న రాష్ట్రపతి

తీర్థయాత్రల పునరుజ్జీవం, ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి పథకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. ఈ నెల 28న వరంగల్ లోని రామప్ప ఆలయం, భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయంలో రాష్ట్రపతి ప్రారంభించనున్నారు.

President Draupadi Murmu : డిసెంబర్ 28న ప్రసాద్ పథకాన్ని ప్రారంభించనున్న రాష్ట్రపతి

President Draupadi Murmu

President Draupadi Murmu : తీర్థయాత్రల పునరుజ్జీవం, ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి పథకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. ఈ నెల 28న వరంగల్ లోని రామప్ప ఆలయం, భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయంలో రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. ఈ ప్రసాద్ పథకంలో భాగంగా ఆలయ వెలుపల అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన వంటి పనులు చేపట్టనున్నారు.

ముఖ్యంగా పర్యాటకులకు విశ్రాంతి భవనాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సీసీ కెమెరాల ఏర్పాటు, పార్కింగ్ సదుపాయం, రహదారుల విస్తరణ, అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్, టాయిలెట్లు, బస చేయడానికి హోటళ్లు, వసతి గౄహాలు, తాగునీరు, క్యూలైన్లు వంటివి ఏర్పాటు చేయాల్సివుంటుంది.
వీటితోపాటు మ్యూజియం, శిల్పారామం వంటి సదుపాయాలు కూడా కల్పించాల్సివుంది.

Droupadi Murmu visit Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రామప్ప ఆలయానికి ఇప్పటికే
యునెస్కో గుర్తింపు లభించడంతో టూరిస్టులు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది.
అభివృద్ధి పనులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ
ఎండీ మనోహర్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలైన వేుమలవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం వంటి ఆలయాలను కూడా ఈ పథకంలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే కేంద్రాన్ని కోరింది.