Droupadi Murmu visit Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఏపీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్రపతి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం ముందు వరాహ దర్శనం చేసుకున్న రాష్ట్రపతి అనంతరం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.అనంతరం మహాద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించి తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. శ్రావారిని దర్శనానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆలయ ప్రధాన అర్చకులు ఘన స్వాగతం పలికారు.

Droupadi Murmu visit Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

Draupadi Murmu Tirumala Visit

Draupadi Murmu Tirumala Visit: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఏపీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్రపతి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం ముందు వరాహ దర్శనం చేసుకున్న రాష్ట్రపతి అనంతరం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.అనంతరం మహాద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించి తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. శ్రావారిని దర్శనానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆలయ ప్రధాన అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి తిరిగి అతిథి గృహానికి చేరుకున్నారు.

కొంత సమయంలో విశ్రాంతి తీసుకున్న తరువాత ఆమె తిరుపతి చేరుకుంటారు. ఆ తరువాత ఆమె 11
35 గంటలకు అలిపిరిలోనే గోమందిరాన్ని సందర్శిస్తారు.11 55 గంటలకు శ్రీపద్మావతి యూనివర్శిటీలోని విద్యార్థినిలతో ముఖా ముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత మధ్యాహ్నాం 1.20గంటలకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు.1.40గంటలకు తిరిగి రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుని ఢిల్లీకి పయనమవుతారు.

కాగా..రెండు రోజుల తిరుపతి, తిరుమల పర్యటన నిమిత్తం జిల్లాకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు రేణిగుంట విమానాశ్రయంలో ఆదివారం రాత్రి ఘనస్వాగతం లభించింది. రెండు రోజుల తిరుపతి, తిరుమల పర్యటన నిమిత్తం జిల్లాకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు రేణిగుంట విమానాశ్రయంలో ఆదివారం (డిసెంబర్ 4,2022)రాత్రి ఘనస్వాగతం లభించింది. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు డీజీ రవిశంకర్‌, కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వరరెడ్డి, బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం తిరుమలకు బయలుదేరి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు.