Madhu Yaskhi Goud: 10టీవీ వీకెండ్ పాడ్ కాస్ట్ లో టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ పలు అంశాలపై మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరగబోతోంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ రెఫరెండంగా తీసుకుంటుందా? ఓడిపోతే.. పాలనా వైఫల్యంగా అంగీకరిస్తారా? అనే ప్రశ్నకు యధుయాష్కీ గౌడ్ ఏమని చెప్పారంటే..
”సింగిల్ గా జరిగే ఎన్నిక ఏదైనా కూడా రెఫరెండం కాదు. అధికార పార్టీ కానీ ప్రతిపక్షం కానీ దీన్ని రెఫరెండంగా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఒక్కో ఉపఎన్నిక స్థానిక సమస్యలపై జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక మనకు చాలా కీలకం. ఇది గెలిచి తీరాలి. దీని కోసం ఒక ప్రణాళిక రచించమని ముఖ్యమంత్రికి, పీసీసీ చీఫ్ కి చెప్పాను.
క్యాంపెయినింగ్ కమిటీగా ఆరు నెలల నుంచి నేను ఇదే మాట చెబుతున్నా. ఈ ఉప ఎన్నికలో ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే అది వారికి అడ్వాంటేజ్ అవుతుంది. అందుకే అలా కాకూడదనే అలర్ట్ చేశాను. జనరల్ గా ఉపఎన్నికలో అధికార పార్టీకే అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ కనిపిస్తోంది” అని మధుయాష్కీ గౌడ్ అన్నారు.
Also Read: ఆనాడు బీఆర్ఎస్ విలీనానికి అడ్డంకి ఎవరు? 10టీవీ వీకెండ్ పాడ్‌కాస్ట్‌లో మధుయాష్కీ కీలక వ్యాఖ్యలు
బీసీలను తొక్కేస్తున్నారా? నిజమేనా? ఎందుకు తొక్కేస్తున్నారు..
ఎన్నో అర్హతలు ఉన్నా, ఎంతో అనుభవం ఉన్నా, ఎంతో నాల్డెజ్ ఉన్నా, ఎంతో కెపాసిటీ ఉన్నా.. మధుయాష్కీ లాంటి వారికి ఎందుకు అవకాశాలు రావడం లేదు?
‘బీసీ నాయకత్వాన్ని తొక్కేస్తున్నారు అనేది ఏళ్ల నుంచి వస్తోంది. ఏ రాజకీయ పార్టీ అయినా అది కామన్. కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతోంది. అది కంటిన్యూ అవుతోంది. బీసీలను తొక్కేస్తారు.. అది వాస్తవమే. నేను బీసీ నాయకుడిని. అగ్ర కులాల కన్నా చాలా ఎక్కువ చదువుకున్నా. అమెరికా, విదేశాల్లో ఉన్న అనుభవం ఉంది. రెండు పర్యాయలు పార్లమెంట్ సభ్యుడిగా పని చేసిన అనుభవమూ ఉంది. నేను చాలా కమిటీల్లో పని చేశాను. తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించాను. ఇన్ని చేసినా, ఇన్ని అర్హతలు ఉన్నా.. నా పేరు వచ్చేసరికి.. మధుయాష్కీ బీసీ నాయకుడు అంటారు. అదే అగ్రకులాలు అయితే దేశ నాయకుడు, రాష్ట్ర నాయకుడు అంటారు” అని మధుయాష్కీ గౌడ్ అన్నారు.