KPHB: హైదరాబాద్ లో కేపీహెచ్ బీ లేడీస్ హాస్టల్ లో మహిళ మృతి

కేపీహెచ్ బీ 5వ రోడ్డులోని ప్రైవేట్ సాయి అమృత హాస్టల్ లో రెండు రోజుల క్రితం హాసిని ప్రియ(33) అనే మహిళ చేరారు.

KPHB Women Hostel

KPHB Ladies Hostel : హైదరాబాద్ లో ప్రైవేట్ లేడీస్ హాస్టల్ ఓ మహిళ మృతి చెందారు. కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి అమృత ప్రైవేట్ లేడీస్ హాస్టల్ లో మహిళ మృతి చెందారు. కేపీహెచ్ బీ 5వ రోడ్డులోని ప్రైవేట్ సాయి అమృత హాస్టల్ లో రెండు రోజుల క్రితం హాసిని ప్రియ(33) అనే మహిళ చేరారు. ఈ నేపథ్యంలో ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు.

ఇటీవలే గచ్చిబౌలిలో ఉన్న ఆమె ఆరోగ్యం బాగా లేకపోవడంతో సోమవారం రాత్రి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కేపీహెచ్ బీలో మంగళవారం సాయంత్రం తన మిత్రుల ద్వారా అమృత హాస్టల్ కు వెళ్లారు. కాగా, మంగళవారం రాత్రి ఆమె మృతి చెందారు.

Also Read: అమెరికాలో కాల్పుల కలకలం.. 22 మంది మృతి.. 60 మందికిపైగా గాయాలు

నెల్లూరు జిల్లా వింజమూరు గ్రామానికి చెందిన మహిళగా గుర్తించారు. మహిళ ఓ పబ్ లో పని చేస్తున్నట్లు సమాచారం. ఘటనాస్థలానికి చేరుకున్న కేపీహెచ్ బీ పోలీసులు మృతదేహన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.