Hyderabad : కుమారుడిని ఉరేసి చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ

శిరీష(22) అనే మహిళకు విశ్వనాథ్ తో నాలుగేళ్ల క్రితం పెళ్లి అయింది. వీరికి మూడేళ్ల వయసున్న మనీష్ అనే కుమారుడు ఉన్నాడు.

Woman kill

Woman Ends Life Itself : హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో ఓ మహిళ కుమారుడిని చంపి అనంతరం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శిరీష(22) అనే మహిళకు విశ్వనాథ్ తో నాలుగేళ్ల క్రితం పెళ్లి అయింది. వీరికి మూడేళ్ల వయసున్న మనీష్ అనే కుమారుడు ఉన్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇంట్లో శిరీష కుమారుడిని ఉరేసి చంపేశారు.

అనంతరం ఆమె కూడా అదే ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Road Accident : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బొలెరో, ముగ్గురు మృతి

మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. శిరీష తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త, అత్తామామల వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.