Telangana CM Revanth Reddy : యశోద ఆస్పత్రిలో ఆసక్తికర ఘటన.. రేవంత్ అన్న అంటూ పిలిచిన మహిళ.. సీఎం ఏం చేశారంటే.. వీడియో వైరల్

యశోధ ఆస్పత్రి నుంచి సీఎం రేవంత్ రెడ్డి బయటకు వస్తున్న క్రమంలో ఆస్పత్రిలో ఓ మహిళ ‘రేవంత్ అన్న.. రేవంత్ అన్నా మీతో మాట్లాడాలి’ అంటూ అభ్యర్థించింది.

Revanth Reddy

CM Revanth Reddy : తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత పాలనలో దూకుడుగా ముందుకెళ్తున్నారు. సమీక్షలు, సమావేశాలతో బిజీబిజీగా గడుపుతూనే.. ఆరు గ్యారెంటీ పథకాల హామీల అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం నిధుల పెంపునకు ఇప్పటికే శ్రీకారం చుట్టారు. తాజాగా రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు సీఎం హోదాలో రేవంత్ స్పందించిన తీరుపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Telangana Government : సీఎం రేవంత్ రెడ్డి దూకుడు.. కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమాజిగూడలోని యశోధ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత రెండు రోజుల క్రితం ఆయన నివాసంలో కిందపటంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. ఆదివారం యశోధ ఆస్పత్రికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను పరామర్శించారు. కేసీఆర్ కు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, అసెంబ్లీకి రావాలని రేవంత్ ఆకాంక్షించారు.

Also Read : Dhiraj Sahu raids: 176 బస్తాల్లో వందల కోట్లు.. ఎంత లెక్కించినా పూర్తవ్వని కాంగ్రెస్ నేత అవినీతి సొమ్ము

యశోధ ఆస్పత్రి నుంచి సీఎం రేవంత్ రెడ్డి బయటకు వస్తున్న క్రమంలో ఆస్పత్రిలో ఓ మహిళ ‘రేవంత్ అన్న.. రేవంత్ అన్నా మీతో మాట్లాడాలి’ అంటూ అభ్యర్థించింది. వెంటనే స్పందించిన రేవంత్ రెడ్డి ఆమె వద్దకు వెళ్లారు.. మీ సమస్య ఏమిటో చెప్పాలని సదరు మహిళను కోరారు. తన పాపకు ఆస్పత్రికి సంబంధించిన ఖర్చు చాలా అవుతుందని, కొంచెం సాయం చేయాలని మహిళ రేవంత్ రెడ్డిని కోరింది. దీంతో వెంటనే సమస్య పరిష్కరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి స్పందించిన తీరుపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు