Dhiraj Sahu raids: 176 బస్తాల్లో వందల కోట్లు.. ఎంత లెక్కించినా పూర్తవ్వని కాంగ్రెస్ నేత అవినీతి సొమ్ము

దేశీ మద్యం అమ్మకం ద్వారా ఈ మొత్తాన్ని పొందినట్లు ఆదాయపు పన్ను శాఖ భావిస్తున్నది. ఆదాయపు పన్ను శాఖ దాడిలో పట్టుకున్న అతిపెద్ద నగదు ఇదే కావడం గమనార్హం

Dhiraj Sahu raids: 176 బస్తాల్లో వందల కోట్లు.. ఎంత లెక్కించినా పూర్తవ్వని కాంగ్రెస్ నేత అవినీతి సొమ్ము

కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు దాచిన సొమ్మును ఆదాయపు పన్ను శాఖ పట్టుకునే పనిలో ఉంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 318 కోట్ల రూపాయలను రికవరీ చేసింది. ప్రస్తుతం నోట్ల లెక్కింపు కొనసాగుతోందని, ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సాహు నుంచి రికవరీ అయిన డబ్బును ఒడిశాలోని బోలంగీర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన శాఖలో లెక్కిస్తున్నారు. కాగా, అర్థరాత్రి వరకు మొత్తం నగదును లెక్కించనున్నట్లు ఎస్‌బీఐ అధికారులు తెలిపారు.

నోట్లతో నింపిన 176 బస్తాలు
ఈరోజు తెల్లవారుజామున ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్ భగత్ బెహెరా మాట్లాడుతూ, తమ వద్దకు 176 నోట్లతో నిండిన బ్యాగులు వచ్చాయని, వాటిలో 140 లెక్కించినట్లు తెలిపారు. 50 మంది బ్యాంకు అధికారులు 25 మిషన్లతో నగదు లెక్కిస్తున్నారని ఆయన తెలిపారు.

డిసెంబరు 6న దాడి ప్రారంభం
కాగా, బౌద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్, దాని ప్రమోటర్లు, ఇతరులపై మారథాన్ దాడి ఆదివారం ఐదవ రోజుకు చేరుకుంది. పన్ను ఎగవేత ఆరోపణలపై డిసెంబర్ 6న కాంగ్రెస్ ఎంపీకి సంబంధించిన కంపెనీల ప్రాంగణాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు ప్రారంభించింది.

దేశీ మద్యం అమ్మకం ద్వారా వచ్చిన సొమ్ము
దేశీ మద్యం అమ్మకం ద్వారా ఈ మొత్తాన్ని పొందినట్లు ఆదాయపు పన్ను శాఖ భావిస్తున్నది. ఆదాయపు పన్ను శాఖ దాడిలో పట్టుకున్న అతిపెద్ద నగదు ఇదే కావడం గమనార్హం. అంతకుముందు 2019లో కాన్పూర్ వ్యాపారి నుంచి రూ.257 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.