BJP Third List : బీజేపీ మూడో జాబితాపై మహిళ నేతలు అసంతృప్తి.. కేవలం ఒక్కటే టికెట్ కేటాయింపు

సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఐదుగురు మహిళ నేతలు టికెట్ ఆశించారు. కానీ మూడో జాబితాలో కనీసం ఒక్కరికి కూడా చోటు దక్కలేదు.

BJP third list Women Leaders unhappy

BJP Third List Women Leaders Unhappy : తెలంగాణ బీజేపీ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. గురువారం 35 మంది అభ్యర్థులను ప్రకటించారు. బీజేపీ మూడో జాబితాపై మహిళ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మూడో జాబితాలో మహిళలకు కేవలం ఒకే టికెట్ ఇవ్వడం పట్ల అసంతృప్తి చెందుతున్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఐదుగురు మహిళ నేతలు టికెట్ ఆశించారు. కానీ మూడో జాబితాలో కనీసం ఒక్కరికి కూడా చోటు దక్కలేదు.

జూబ్లీహిల్స్ నుండి విరేపనేని పద్మ, సనంత్ నగర్ నుండి ఆకుల విజయా, ముషీరాబాద్ నుంచి బండారు విజయ, అంబర్ పేట నుంచి మహిళ మోర్చా అధ్యక్షురాలు గీత మూర్తి, సికింద్రాబాద్ నుంచి బండ కార్తీక టికెట్ ఆశించారు. మొత్తంగా 88 మందిలో మహిళ మోర్చాలో పని చేసిన వారికి ఒక్కరికీ టికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tharun Bhascker : బ్రహ్మి గెటప్స్‌తో తరుణ్ భాస్కర్ స్పూఫ్ వీడియో చూశారా..?

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ అసంతృప్తిలో ఉన్నాడు. సికింద్రాబాద్ పార్లమెంటులో ఏదో ఒక స్థానంలో సద్దుబాటూ చేస్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. మూడో జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముందుగా గోషామహల్ విక్రమ్ గౌడ్ టికెట్ ఆశించారు. కానీ ఆ స్థానాన్ని రాజాసింగ్ కు కేటాయించారు.