Begum Bazaar to Mojamjahi Market
Hyderabad : భాగ్యనగరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంబరాన్ని అంటాయి. 77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మహిళలు పొడవైన జాతీయ జెండాను పట్టుకుని హైదరాబాద్ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు.
హైదరాబాద్ నగరం దేశభక్తితో పులకించిపోయింది. విద్యార్ధులు, మహిళలు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాలు పంచుకున్నారు. 250 మీటర్ల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున మహిళలు బేగం బజార్ నుండి మొజాంజాహీ మార్కెట్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఆటపాటలతో సందడి చేశారు.
Independence Day2023: గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం కేసీఆర్.. ఫొటో గ్యాలరీ
జెండా పండుగలో చిన్నారులు సైతం పాల్గొన్నారు. త్రివర్ణంలో ఉన్నదుస్తులను ధరించి ఉత్సాహంగా ముందుకు కదలిలారు. ఈ ర్యాలీకి సంబంధించిన క్లిప్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.