Jogulamba Gadwal : భూమిలో లంకె బిందె, వాటా కోసం కూలీల కొట్లాట..చివరకు

భూమిలో లభ్యమైంది లంకె బిందె. యజమానికి తెలియకుండా..గుట్టుగా నొక్కెద్దామనుకున్నారు. కానీ..వారి ప్లాన్ బెడిసికొట్టింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది.

Gupta Nidhulu : ఇంటి నిర్మాణానికి పునాది తీస్తున్న కూలీల కళ్లల్లో ఒక్కసారిగా ఆశ్చర్యం. తమ బతుకులు మారిపోతున్నాయని ఎవరికి వారే కలలు కన్నారు. ఎందుకంటే..వారికి భూమిలో లభ్యమైంది లంకె బిందె. యజమానికి తెలియకుండా..గుట్టుగా నొక్కెద్దామనుకున్నారు. కానీ..వారి ప్లాన్ బెడిసికొట్టింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. దాదాపు కిలోన్నరకు పైగా ఉన్న ఈ బంగారం విలువ రూ. 80 లక్షలకు పైగానే ఉంటుందని అంచనా.

Read More : Samantha Ramsdell : వామ్మో.. ఎంత పెద్దనోరు ఈమెది.. గిన్నీస్ బుక్ రికార్డు బ్రేక్ చేసిందిగా!

జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడులో ఓ ఇంటి నిర్మాణానికి పునాది తీసే పనిని రెండు నెలల క్రితం 11 మంది కూలీలకు అప్పగించారు. ఇందులో ఓ రోజు 9 మంది కూలీలు పనిలో పాల్గొని తవ్వుతున్నారు. అకస్మాత్తుగా లంకెబిందె బయటపడింది. యజమానికి తెలియకుండా..అందరం సరిసమానంగా పంచుకుందాని డిసైడ్ అయ్యారు. ఆ లంకెబిందెను రహస్యంగా తరలించారు.

Read More : Lucky Woman : అదృష్టమంటే ఈమెదే.. లాటరీని పర్సులో పెట్టుకుని తిరిగింది.. కోట్లు గెల్చుకుంది!

అందులో ఉన్న వంద నాణెలను తొమ్మిది వాటాలు వేసుకున్నారు. ఏపీలోని కర్నూలు జిల్లా కోడుమూరు, ఎమ్మిగనూరు, నందికొట్కూరులో తెలిసిన బంగారం వర్తకులను సంప్రదించారు. కొందరు ఆభరణాలు చేయించుకుంటే..ఇంకొందరు అమ్మి సొమ్ము చేసుకున్నారు. మరికొందరు తాకట్టు పెట్టుకున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే..మరో ఇద్దరు కూలీలకు ఈ విషయం తెలియదు. తర్వాత తెలియడంతో తమకు వాటా పంచాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం బయటకు పొక్కింది. దీనిపై కథనాలు వెలువడ్డాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఏడుగురు కూలీల నుంచి సొత్తు రికవరీ చేయగా..మరో ఇద్దరు తాకట్టు పెట్టారని గుర్తించారు. ఇవి పురాతన నాణేలా ? కావా ? అనే దానిపై ఇంకా పూర్తి క్లారిటీ రావడం లేదు.

ట్రెండింగ్ వార్తలు