IAS, IPS Officers (Image Credit To Original Source)
Yadadri Bhuvanagiri dist: ఎంతో ఆడంబరంగా పెళ్లి వేడుకను జరుపుకోవాలని అందరూ భావిస్తారు. చాలా మంది తమ స్తోమతకు మించి ఖర్చు చేసి మరీ పెళ్లి చేసుకుంటారు. పెళ్లి వేడుకను ఘనంగా జరుపుకోవడం కోసం అప్పులు కూడా చేస్తుంటారు.
అయితే, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎలాంటి ఆడంబరాలు లేకుండా పెళ్లి చేసుకుని ఆదర్శంగా నిలిచారు. ఉన్నత ఉద్యోగాల్లో ఉండి కూడా వారు అతి తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకున్నారు.
చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ పెళ్లి జరిగింది. చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడేనికి చెందిన యువ ఐపీఎస్ అధికారిని శేషాద్రిని రెడ్డిని కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి పెళ్లి చేసుకున్నారు.
ప్రస్తుతం కుత్బుల్లాపూర్ డీసీపీగా శేషాద్రిని రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి ఐఏఎస్ ట్రైనింగ్‌లో ఉన్నారు. వివాహానికి పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.