Yadadri Temple: యాదాద్రి ఆలయంలో పవిత్రోత్సవాలు, ఖజానాకు రూ.13లక్షల 5వేల 116

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఖజానాకు రూ.13లక్షల 5వేల 116 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో గీత తెలిపారు.

Yadadri Temple: యాదాద్రి ఆలయంలో పవిత్రోత్సవాలు, ఖజానాకు రూ.13లక్షల 5వేల 116

Yadadri Temple

Updated On : August 16, 2021 / 9:23 PM IST

Yadadri Temple: శ్రావణ మాసం పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో 17 నుంచి పవిత్రోత్సవాలను ప్రారంభించనున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆగష్టు 19వ తేదీ వరకు మూడు రోజులు పాటు జరిగే ఉత్సవాల నిర్వహణకు ఆలయంలో సర్వం సిద్ధమైంది. ఉత్సవాల నేపథ్యంలో హోమాదులు నిర్వహించేందుకు బాలాలయంలో యాగశాలను ఏర్పాటు చేశారు.

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఖజానాకు రూ.13లక్షల 5వేల 116 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో గీత తెలిపారు. దర్శనం ద్వారా వచ్చిన ఆదాయం వివరాలు ఇలా ఉన్నాయి.
మెయిన్ బుకింగ్‌తో రూ.లక్షా 96వేల 956
రూ. 100 దర్శనంతో రూ. 27వేల 400
వీఐపీ దర్శనాల ద్వారా రూ. 80వేల 850
సుప్రభాతం ద్వారా రూ. వెయ్యి 600
నిత్య కైంకర్యాలతో రూ. 5వేల 502
క్యారీబ్యాగులతో రూ. 3వేల 300
సత్యనారాయణ వ్రతాల ద్వారా రూ. 78వేలు
కల్యాణకట్టతో రూ. 31వేలు
ప్రసాద విక్రయంతో రూ. 4లక్షల 96వేల 875

శాశ్వత పూజల ద్వారా రూ. 17వేల 580
వాహన పూజలతో రూ. 15వేల 300
టోల్‌గేట్‌తో రూ. 590
అన్నదాన విరాళంతో రూ. 6వేల 743
సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. లక్షా 37వేల 500
యాదరుషి నిలయంతో రూ. 55వేల 800
పాతగుట్టతో రూ. 36వేల 40
టెంకాలయ విక్రయాలతో రూ.96వేలు
ఇతర విభాగాలతో రూ. 18వేల 80

ఏడాది పాటు ఆలయంలో పూజల్లో, భక్తుల దోషాలు చెరిగిపోయేందుకు ఏటా పవిత్ర ఉత్సవాలను నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు.