KCR
KCR Health Bulletin: మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హెల్త్ బులెటిన్ ను యశోద ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. నీరసంగా ఉండటంతో కేసీఆర్ ఆసుపత్రిలో చేరారని డాక్టర్లు తెలిపారు. కేసీఆర్ కు బ్లడ్ షుగర్ పెరిగిందన్నారు. అలాగే సోడియం లెవెల్స్ తగ్గాయని హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు డాక్టర్లు.