అమ్మా, నాన్న సారీ.. నా చావుకు అతడే కారణం.. సెల్ఫీ వీడియో తీసి ప్రేమికుడి ఇంట్లో యువతి బలవన్మరణం..

ప్రేమ పేరుతో మోసపోయానంటూ సెల్ఫీ వీడియో తీసుకొని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.

Kavya incident in Khammam district

Khammam: సారీ అమ్మా.. సారీ డాడీ.. నేను మోసపోయా.. చనిపోతున్నా.. నా చావుకు కారణం అభి అంటూ 32యేళ్ల యువతి ప్రియుడి ఇంట్లో సెల్ఫీ వీడియో తీసి అనంతరం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా రూరల్ మండలంలో చోటు చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: 2 ఎకరాల పొలం, రూ.5 లక్షలు క్యాష్ డీల్.. ఆపరేషన్ చేసి కిడ్నీ తీసుకున్నారు.. కట్ చేస్తే..

ప్రియుడి ఇంట్లోనే ఉరేసుకొని..
ఖమ్మం బ్యాంకు కాలనీకి చెందిన మంగళగిరి శ్రీకల్యాణి అలియాస్ కావ్య (32) హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు పూర్తి చేసింది. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామంకు చెందిన అభిలాష్ అనే వ్యక్తిని ప్రేమించింది. అతను హైదరాబాద్ లో డ్యాన్స్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గతంలో కావ్య తన ప్రేమ విషయాన్ని తన ఇంట్లో చెప్పగా తల్లిదండ్రులు అందుకు నిరాకరించారు. అయినా కావ్య, అభిలాష్ తమ బంధం కొనసాగిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కావ్యను పొన్నెకల్ లోని తన ఇంటికి అభిలాష్ తీసుకెళ్లాడు. మళ్లీ తన పుట్టింటికి వెళ్లిపోవటంతో శనివారం మాట్లాడుకుందామని అభిలాష్ పొన్నెకల్లులోని తన నివాసానికి పిలిచాడు. కావ్య వెళ్లింది.

 

ఇద్దరి మధ్య వాగ్వాదం..
అభిలాష్ ఇంటికి కావ్య వెళ్లగా.. ఇంట్లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కావ్య మరో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. అభిలాష్, అతని కుటుంబ సభ్యులు తలుపులు తీసేందుకు ప్రయత్నిస్తుండగానే కావ్య సెల్ఫీ వీడియో తీసి.. అనంతరం ఉరి వేసుకుంది. అభిలాష్ కుటుంబీకులు తలుపులు పగలగొట్టి ఆమెను బయటకు తీసుకొచ్చి ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కావ్య మృతిచెందింది. దీంతో మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

సెల్ఫీ వీడియోలో కావ్య ఏం చెప్పిదంటే..
సెల్పీ వీడియోలో ‘నా పేరు కావ్య.. నేను చనిపోతున్నాను. నా చావుకు కారణం అభి. ఐదు సంవత్సరాల నుంచి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి వాళ్లింట్లో పెట్టుకుని ఇప్పుడు నన్ను వదిలేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాడు. నన్ను ఇంట్లో నుంచి వెళ్లిపోమని అంటున్నాడు. ముడి పెట్టి ఉన్న చీరను చూపిస్తూ.. ఇప్పుడు నేను ఉరి వేసుకోబోతున్నాను. నా చావుకు కారణం అభి. సారీ అమ్మా.. సారీ డాడీ’ అంటూ కావ్య సెల్ఫీ వీడియోలో పేర్కొంది.