×
Ad

Hyderabad : ఖాళీ ప్లాట్‌లో ఏకాంతంగా కలిసిన ప్రేమికులు.. యువతి తండ్రి రావడంతో..

Hyderabad : ఖాళీ ప్లాట్‌లో యువతి ప్రియుడితో ఏకాంతంగా ఉంది. ఆ సమయంలో ఆమె తండ్రి ప్లాట్ వద్దకు రావడంతో.. తండ్రికి కనిపించకుండా తప్పింకునే

Hyderabad : సంగారెడ్డి జిల్లా కొల్లూరు డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. ఖాళీ ప్లాట్‌లో యువతి ప్రియుడితో ఏకాంతంగా ఉంది. ఆ సమయంలో ఆమె తండ్రి ప్లాట్ వద్దకు రావడంతో.. తండ్రికి కనిపించకుండా తప్పింకునే ప్రయత్నంలో యువతి ఎనిమిదో అంతస్తు పైనుంచి పడి మరణించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read : Hyderabad Traffic : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఇవాళ ఈ రూట్లలో వెళ్లకండి.. ట్రాఫిక్ మళ్లింపులు ఇవే..

హైదరాబాద్‌లోని పాతబస్తీ కోమటివాడకు చెందిన ఫాతిమా (20), చార్మినార్ కు చెందిన మీర్ హుస్సేన్ అలీఖాన్ కు పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు వారిద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఫాతిమా కుటుంబానికి కొల్లూరు డబుల్ బెడ్రూం ఫేజ్-1లోని 40వ బ్లాక్ ఎనిమిదో అస్తులతో ఇల్లు మంజూరి అయింది. ప్లాట్ ఖాళీగా ఉండటంతో ఫాతిమా తన ప్రియుడు మీర్ హుస్సేన్ అలీఖాన్‌తో కలిసి ప్లాట్ వద్దకు వెళ్లింది. వారిద్దరూ ప్లాట్ లో ఏకాంతంగా ఉన్న సమయంలో ఫాతిమా తండ్రి సయ్యద్ అలాందార్ ప్లాట్ వద్దకు వచ్చాడు. డోర్ తీసే క్రమంలో లోపలి గడీపెట్టి ఉండటాన్ని గమనించాడు.

తమ ప్లాట్‌కు లోపల గడీపెట్టి ఉండటంతో లోపల ఎవరో ఉన్నారని గమనించిన సయ్యద్ అలాందార్.. చుట్టుపక్కల వారిని పిలిచి వారి సహాయంతో డోర్ ను తీసే ప్రయత్నం చేశాడు. దీంతో ప్లాట్ లోపల ఉన్న ఫాతిమా, హుస్సేన్ భయాందోళనకు గురయ్యాడు. తన తండ్రి చూస్తే ఇబ్బంది అవుతుందని ఆందోళన చెందిన ఫాతిమా.. తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ప్రియుడు హుస్సేన్ తో కలిసి తమ ఫ్లాట్ బాల్కనీ నుంచి పక్కింటి బాల్కనీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.

పక్కింటి బాల్కనీలోకి వెళ్లే క్రమంలో ఫాతిమా పట్టుతప్పి ఎనిమిదో అంతస్తు నుంచి కిందపడిపోయింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఫాతిమా తండ్రి అలాందార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.