Missing : హైదరాబాద్‌లో యువతి మిస్సింగ్ కలకలం.. బ్యూటీ పార్లర్‌కు వెళ్తున్నానని చెప్పి
హైదరాబాద్‌లో ఓ యువతి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. దోమలగూడలో నివాసం ఉంటున్న భార్గవి అనే యువతి నిన్నటి నుంచి కనిపించకుండా పోయింది.
- Naveen
- Published On : November 11, 2021 / 10:15 PM IST
Missing
Missing : హైదరాబాద్‌లో ఓ యువతి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. దోమలగూడలో నివాసం ఉంటున్న భార్గవి అనే యువతి నిన్నటి నుంచి కనిపించకుండా పోయింది. బ్యూటీ పార్లర్ కు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన భార్గవి తిరిగి రాలేదు. దీంతో నిన్నటి నుంచి కుటుంబీకులు భార్గవి కోసం తెలిసిన వాళ్ల దగ్గర, బంధువుల ఇళ్లలో వెతికారు. అయినా ఫలితం లేకపోయింది. భార్గవి ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తోంది.
Best Food : మాంసాహారాన్ని మించిన ఆహారం ఇదే…
కాగా, భార్గవికి ఏడాది క్రితమే వివాహమైంది. భార్గవి ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నగరంలోని పలు ప్రాంతాల్లో భార్గవి నడుచుకుంటూ తిరుగుతున్నట్లుగా సీసీ కెమెరాల ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. భార్గవి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
