Youth Congress leaders attacked BJP office at Hyderabad Nampally with stones
Telangana BJP: హైదరాబాద్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూత్ కాంగ్రెస్ నాయకులు, బీజేపీ శ్రేణులు ఒకరిపైఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయంపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేయగా.. పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు రంగంలోకిదిగి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కార్యాలయం భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
Also Read: Raghunandan Rao: కేటీఆర్ అరెస్ట్‌పై రఘునందన్ రావు ఏమన్నారంటే!
హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ నేత రమేశ్ బిధూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత నియోజకవర్గంలోని అన్ని రహదారులను ప్రియాంకా గాంధీ బుగ్గల్లా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సదరు బీజేపీ నేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేత వ్యాఖ్యలను నిరసిస్తూ తాజాగా తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో వారిని బీజేపీ నేతలు అడ్డుకోవటంతో తీవ్ర ఉధ్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
Also Read: Harish Rao: భయపడేది లేదు.. హైకోర్టు తీర్పు తరువాత హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
బీజేపీ శ్రేణులు, యూత్ కాంగ్రెస్ నేతలు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయంపై రాళ్లు, కోడి గుడ్లపై దాడి చేశారు. అప్రమత్తమైన పోలీసులు రంగంలోకిదిగి వారిని చెదరగొట్టారు. పలువురి ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో బీజేపీ కార్యాలయం వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.