YouTuber Vaishnavi Husband : యూట్యూబర్ వైష్ణవి భర్త హత్యకేసులో పురోగతి.. నేనే చంపానంటూ సెల్ఫీ వీడియో..

YouTuber Vaishnavi Husband Killed Case : యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హత్య జరిగిన కొద్దిగంటలకే వైష్ణవి సోదరుడు సంతోష్ సెల్పీ వీడియో విడుదల చేశాడు.

YouTuber Vaishnavi husband Haribabu Killed Case

YouTuber Vaishnavi Husband Killed Case : యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హత్య జరిగిన కొద్దిగంటలకే వైష్ణవి సోదరుడు సంతోష్ సెల్పీ వీడియో విడుదల చేశాడు. హరిబాబును తానే హత్య చేశానని.. నా చెల్లిని చంపిన వాడిని చంపేశాను. నా చెల్లికి జరిగినట్లు ఏ ఆడబిడ్డకు జరగకూడదని వైష్ణవి సోదరుడు సంతోష్ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. తాను సరెండర్ అవ్వబోతున్నట్లు చెప్పుకొచ్చాడు.

Also Read : Telangana Rains : దూసుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఈ 15జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ..

నిజామాబాద్ నగరంలోని రాజరాజేంద్ర చౌరస్తా వద్ద నడిరోడ్డుపై హరిబాబు (26) గురువారం సాయంత్రం దారుణ హత్యకు గురయ్యాడు. ముగ్గురు వ్యక్తులు కారులో వచ్చి కొబ్బరి బోండాల కొట్టే కత్తితో హరిబాబుపై దాడిచేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, హరిబాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుల కోసం పోలీసులు వేట ప్రారంభించారు. ఈ క్రమంలోనే హరిబాబును హత్య చేసింది నేనే అంటూ వైష్ణవి సోదరుడు సంతోష్ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. పోలీసులకు లొంగిపోతున్నానని పేర్కొన్నాడు.

తన చెల్లి గర్భవతి అని కూడా చూడకుండా అన్యాయంగా పొట్టనబెట్టుకున్నవాడిని తానే అంతం చేశానని సంతోష్ సెల్పీ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ హత్య తానే చేశానని.. తప్పు చేశాననే బాధ తనకు లేదని అన్నాడు. ఏ ఆడబిడ్డకు కూడా తన చెల్లికి జరిగినటువంటి అన్యాయం పునరావృతం కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. తన చెల్లి హత్యకు ప్రతీకారంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంతోష్ పేర్కొన్నాడు. తన చెల్లి మరణానికి ఇలా న్యాయం చేశానని చెప్పుకొచ్చాడు.

కోరుట్లకు చెందిన హరిబాబు, మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి (19) ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. వారు యూట్యూబ్‌లో రీల్స్ చేస్తుండేవారు. ఇద్దరి మధ్య గొడవలు జరగగా.. ఈ ఏడాది మార్చి 16న వైష్ణవిని హత్య చేసిన ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో హరిబాబు, అతడి తల్లితోపాటు ఇద్దరు అన్నలూ జైలుపాలయ్యారు. హరిబాబు ఇటీవలే జైలు నుంచి బెయిలు పై బయటకు వచ్చాడు. అయితే, గురువారం సాయంత్రం హరిబాబు దారుణ హత్యకు గురికావడం నిజామాబాద్ జిల్లాలో కలకలం సృష్టించింది. అయితే, ఈ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. సంతోష్ పోలీసుల ఎదుట లొంగిపోగా.. కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది.