YS sharmila
YS sharmila..cm kcr : YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై విమర్శలు సంధించారు. ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి తండ్రీకొడుకులకు మతి భ్రమించినట్లుంది అంటూ ఎద్దేవా చేశారు. 10 ఏళ్లు అధికారమిస్తే 65 వేల ఉద్యోగాలు ఇయ్యలేనివారికి..12 లక్షల దరఖాస్తులకు లక్ష ఇళ్లు కట్టటం చేతకాని వాళ్లకు .. మళ్లీ అధికారమిస్తే వడ్లు పండించినట్లు వరద పారిస్తారంట అంటూ సెటైర్లు వేశారు. చెప్పేవాళ్లకు వినేవాళ్లు లోకువ అన్నట్లుగా ఉంది కేసీఆర్ తీరు అంటూ ఎద్దేవా చేశారు.
ఉద్యోగాలు,ప్రభుత్వ పథకాలు ఎక్కడ? అని నిలదీస్తే..చిన్న దొరకు ప్రజలు పిచ్చోళ్లు లెక్క కనిపిస్తున్నారు అంటూ మండిపడ్డారు.అధికార మదంతో కళ్లు నెత్తికెక్కితే నిరుద్యోగులు చులకనగా కనిపిస్తున్నారా కేటీఆర్ గారు ? అంటూ ప్రశ్నించారు. ఉద్యమంలో ఇంటికో ఉద్యోగం అని మాట ఇచ్చారు మీ తండ్రి..అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు ఇవ్వలేక పేపర్లు లీకులు చేసి అమ్ముకున్నారు అంటూ మండిపడ్డారు.
Katikam Mrityunjayam : అవినీతి సామ్రాట్ కేసీఆర్ ఒక్కరోజు కూడా అధికారంలో ఉండకూడదు : కటికం మృత్యుంజయం
కేజీ టూ పీజీ అని చెప్పి విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టించారు అంటూ దుయ్యబట్టారు. పాలన చేతకాని వాళ్లు అంటూ విమర్శించారు.నిరుద్యోగుల శవాల మీద ఇంతకాలం అధికారంలో కూర్చున్న మీకు..ఓట్లు అడగడానికి సిగ్గుండాలి అంటూ ఘాటు విమర్శలు చేశారు.బంగారు తెలంగాణలో ఇంటిల్లిపాది కొలువులు అనుభవించి..అందిన కాడికి దోచుకున్నారని ఇప్పుడు మళ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిపిస్తే..ఇల్లు ఇస్తాం…ఉద్యోగాలిస్తాం అంటూ మోసపూరిత మాటలు చెబుతున్నారు అంటూ విమర్శించారు. మళ్లీ గెలిపిస్తే..ఉద్యోగాలిస్తాం,జాబ్ క్యాలెండర్ ఇస్తాం అనే వింత మాటలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది అంటూ మండిపడ్డారు.