Katikam Mrityunjayam : అవినీతి సామ్రాట్ కేసీఆర్ ఒక్కరోజు కూడా అధికారంలో ఉండకూడదు : కటికం మృత్యుంజయం

మాజీ ఎమ్మెల్యే కటికం మృత్యుంజయం కాంగ్రెస్ లో చేరారు. మాణిక్ రావు ఠాక్రే సమయంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

Katikam Mrityunjayam : అవినీతి సామ్రాట్ కేసీఆర్ ఒక్కరోజు కూడా అధికారంలో ఉండకూడదు : కటికం మృత్యుంజయం

Katikam Mrityunjayam

Updated On : November 21, 2023 / 1:35 PM IST

Katikam Mrityunjayam joined congress : ఓ పక్క ఎన్నికల తేదీ సమీపిస్తోంది. మరోపక్క నేతలు పార్టీల నుంచి జంపింగ్ లు కొనసాగుతునే ఉన్నాయి. దీంట్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే కటికం మృత్యుంజయం కాంగ్రెస్ లో చేరారు. మాణిక్ రావు ఠాక్రే సమయంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మత్యుంజయం ..కేసీఆర్ తెలంగాణ ద్రోహి అంటూ విరుచుకుపడ్డారు. పదేళ్ల బీఆరెస్ ప్రభుత్వాన్ని కూకటి వెళ్ళతో పెకిలించాల్సిన సమయం వచ్చిందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాపల కుక్కల ఉంటాను అన్న కేసీఆర్ దళితులకు ద్రోహం చేశారని విమర్శించారు.

తెలంగాణ ప్రజలు ప్రజలు బీఆరెస్‌ని చిత్కరిస్తున్నారని ప్రతీ ఒక్క వర్గం బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగడానికి వీల్లేదని బావిస్తున్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదంటు ఆరోపించారు. హామీలు నెరవేర్చకుండా కేసీఆర్ అవినీతి సామ్రాట్ అయ్యారు అంటూ ఆరోపించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని అవినీతి కేసీఆర్ చేశారంటూ దుయ్యబట్టారు.

బెదిరిస్తే భయపడేవాళ్లం కాదు, కాలికి ముల్లు దిగితే పన్నుతో తిస్తానంటూ ఈటల కీలక వ్యాఖ్యలు

రెండున్నర సంవత్సరాలుగా బీజేపీ లో ఉన్నానని..ప్రధాని మోడీ,అమిత్ షా కేసీఆర్ అవినీతి గురించి చెప్తారు..కాని చర్యలు తీసుకోరు అంటూ మండిపడ్డారు. కేసీఆర్ అవినీతి గురించి పట్టించుకోరుగానీ కాంగ్రెస్ నేతలపై ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నారు అంటూ బీజేపీపై విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తంచేశారు. బీజేపీ, బీఆరెస్ రెండు ఒకటేనన్నారు. ఈ రెంటింటిని కులగొట్టేది కాంగ్రెస్ మాత్రమేనన్నారు.