Eatala Rajender : బెదిరిస్తే భయపడేవాళ్లం కాదు, కాలికి ముల్లు దిగితే పన్నుతో తిస్తానంటూ ఈటల కీలక వ్యాఖ్యలు
మల్లన్న సాగర్ భూ నిర్వాసితులను చెట్టుకొకళ్లను పుట్టకొకళ్లను చేశారని విమర్శించారు. భూ నిర్వాశితులకు అన్యాయం చేసినవారికి నా పై పోటీ చేసే దమ్ము లేదని ఎద్దేవా చేశారు.

Eatala Rajender
Gajwel BJP candidate Eatala Rajender : సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మల్లన సాగర్ భూ నిర్వాసితుల అర్ అండ్ అర్ కాలనీలో గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల బీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు సంధించారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులను చెట్టుకొకళ్లను పుట్టకొకళ్లను చేశారని విమర్శించారు. భూ నిర్వాశితులకు అన్యాయం చేసినవారికి నా పై పోటీ చేసే దమ్ము లేదని ఎద్దేవా చేశారు.
బీజేపీ నేతలకు ఇక్కడకు రానివ్వకుండా చేస్తున్నారని..వస్తే బెదిరిస్తున్నారని మీ బెదిరింపులకు భయపడేవాళ్లంకాదన్నారు. బెదిరిస్తే బెదరటానికి మేం పిరికివాళ్లం కాదని తాము పోరాటాలు చేసేవాళ్లమన్నారు. తాము ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాలికి ముళ్ళు గుచ్చితే పన్నుతో తిస్తా.. అంటూ ఈటల వ్యాఖ్యానించారు.
తెలంగాణలో రైతులు, ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. నిధుల విడుదలకు ఈసీ బ్రేక్
అన్యాయానికి గురైన భూ నిర్వశితులు బీఆర్ఎస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. భూ నిర్వాసితులకు ప్రభుత్వ విలువ ప్రకారం నష్టపరిహారం ఇస్తుంటే తాను మార్కెట్ ధర ప్రకారం ఇవ్వాలని అప్పుడు తాను చెప్పానని కానీ ప్రభుత్వం తన మాట వినలేదని తెలిపారు. భూ నిర్వాతులకు భూములను దూరం చేసి వాళ్ళను అడ్డా మీద కూలీలను చేశారని ఆరోపించారు.
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంవత్సరానికి నాలుగు గ్యాస్ సిలిండర్ లు ఉచితంగా అధిస్తామని హామీ ఇచ్చారు. అలాగే కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇచ్చే నగదును రూ. లక్ష నుండి రెండు లక్షలకు పెంచుతామన్నారు. 2100 ఉన్న వడ్లకి రూ.3100 రూపాయలకు పెంచుతూ మొత్తం ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు.