Election Commission : తెలంగాణలో రైతులు, ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. నిధుల విడుదలకు ఈసీ బ్రేక్

తెలంగాణలో రైతులకు, ఉద్యోగులకు నిరాశ ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ రైతు బంధు, రుణమాఫీ నిధులు విడుదల, ఉద్యోగుల డీఏకు ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేసింది.

Election Commission : తెలంగాణలో రైతులు, ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. నిధుల విడుదలకు ఈసీ బ్రేక్

Election Commission

Updated On : November 21, 2023 / 12:03 PM IST

Telangana Assembly Elections 2023: తెలంగాణలో రైతులకు, ఉద్యోగులకు నిరాశ ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ రైతు బంధు, రుణమాఫీ నిధులు విడుదల, ఉద్యోగుల డీఏకు ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేసింది. రైతు బంధు, రుణమాఫీ నిధులు విడుదల చేయొద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల డీఏసైతం వద్దని చెప్పింది. ఎన్నికల సమయం కావడంతో.. రైతు బంధు, రుణమాఫీ, డీఏకు రాష్ట్ర ప్రభుత్వం ఈసీ అనుమతి కోరింది. ప్రభుత్వం విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. రైతు బంధు, రుణమాఫీపై గతంలో ఈసీకి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ నోటిఫికేషన్ గడువు పూర్తయ్యే వరకు రైతుబంధు, ఇవ్వకుండా ఆదేశాలివ్వాలని ఈసీని కాంగ్రెస్ కోరిన విషయం తెలిసిందే.

Also Read : Telangana Assembly Election 2023 : కాంగ్రెస్ కట్టడికి బీఆర్ఎస్ మునుగోడు ఫార్ములా?

ప్రతీయేటా ప్రభుత్వం రెండు విడతల్లో రైతు బంధు నిధులు అందిస్తోంది. రబీ సీజన్ నేపథ్యంలో డిసెంబర్ నెలలో రైతు బంధు కింద నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రైతు రుణమాఫీ విషయంలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఎన్నికల కోడ్ ముందువరకు కొందరికి మాత్రమే ప్రభుత్వం రుణమాఫీ చేసింది. దాదాపు 35లక్షల మందికి ఇంకా రుణమాఫీ జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఈసీని అనుమతి కోరింది.

Also Read : IT Raids : మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు.. ఏకకాలంలో పలు చోట్ల తనిఖీలు

స్పందించిన ఈసీ మరో తొమ్మిది రోజుల్లో పోలింగ్ ఉన్న నేపథ్యంలో నిధులను ఎలా విడుదల చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఫలితంగా నిధుల విడుదలకు బ్రేక్ పడింది. రబీకి సంబంధించిన రైతుబంధు నిధులు ప్రతీయేటా డిసెంబర్ నెలలో విడుదలవుతాయి. ఈసీ ఒకవేళ ఇప్పుడు అనుమతి ఇచ్చినా డిసెంబర్ లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది. ఎన్నికల కోడ్ కారణంగా ప్రస్తుతం ఈ ప్రక్రియకు బ్రేక్ పడటంతో ఈసారి రైతుబంధు నిధులు జనవరిలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.