Ys Sharmila
YS Sharmila Padayatra in Telangana : తెలంగాణలో వైఎస్ఆర్ సంక్షేమ పాలన లేదని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ఆర్ సమాధి వద్ద షర్మిల నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో వైఎస్ఆర్ సంక్షేమ పాలన తీసుకురావడమే లక్ష్యంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
రేపు చెవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం పాదయాత్రను షర్మిల ప్రారంభించనున్న విషయం తెలిసిందే. తెలంగాణలోని ప్రతి పల్లెకు పోతామని..ప్రతి గడపను తడతామని చెప్పారు. ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. ప్రజలు పక్షాన పోరాటం చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నట్లు షర్మిల తెలిపారు.