Sharmila
YS Sharmila Financial assistance : సిద్దిపేట జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు చింతల స్వామి కుటుంబానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. గజ్వేల్ నియోజకర్గంలోని దండుపల్లిలో ధరణి పోర్టల్ లో భూమి ఎక్కలేదనే మనోవేదనతో ఒకే ఇంట్లో తండ్రీ కొడుకులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతి చెందిన రైతు చింతల స్వామి కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూమి కోసమే చింతల స్వామి, ఏడాది క్రితం స్వామి తండ్రి ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ధరణిలో లోపాల వల్లే రెండు ప్రాణాలు బలయ్యాయని ఆరోపించారు. సీఎం నియోజకవర్గంలో ఏడాదిగా వీరి భూ సమస్యను పరిష్కరించలేకపోయారని విమర్శించారు. ‘నీ సమస్య పరిష్కారం కాదు, ఇక భూమిని వదులు కావలసిందే’ అని అనడంతో స్వామి లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు షర్మిల పేర్కొన్నారు. ధరణి ఎవరికి మేలు చేయడానికి, ఇంత మంది అధికారులు ఉండి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సీఎం ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు.
Amaravati Farmers : ముగిసిన అమరావతి రైతుల పాదయాత్ర..రేపు శ్రీవారిని దర్శించుకోనున్న అన్నదాతలు
ప్రజలు కేసీఆర్ ను ఎన్నుకున్నది..ఆయన ఫామ్ హౌస్ లో పడుకోవడానికేనా అని ప్రశ్నించారు. రైతు కుటుంబంలో రెండు మరణాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దే బాధ్యతని పేర్కొన్నారు. ఏడాదిగా భర్త చనిపోయిన భార్యకు పెన్షన్ రావడం లేదని తెలిపారు. ముఖ్యమంత్రికి సిగ్గుండాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. కోట్లకు కోట్ల కమిషన్ మింగుతూనే ఉన్నారు.. ఇంకా ఆకలి తీరడం లేదా, పేదల భూములు కూడా కావాలా అని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా బాధిత కుటుంబానిక్ రూ.50 లక్షలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.