Bullet Bandi Song
Bullet Bandi Song : సంగీతానికి రాళ్లు కరిగాయని… పశువులు పరవశించి ఎక్కువ పాలిచ్చాయని గతంలో వార్తలు విన్నాం. మనసుకు నచ్చిన ప్రశాంతమైన సంగీతం వింటే మనసులోని ఎంతటి అలజడి అయినా తగ్గి పోతుందని చెపుతుంటారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన డుగ్గుడుగ్గు బుల్లెట్ బండి ఎక్కి పాటకు జగిత్యాలకు చెందిన ఓ నూతన వధువు డ్యాన్స్ చేయగా లక్షలాది మంది ఆ వీడియోను చూసిన సంగతి తెలిసిందే. ఇప్పడు అదే పాట పాడి ఆస్పత్రిలో బెడ్ మీద ఉన్న పక్షవాతం రోగిలో కదలిక తీసుకువచ్చింది ఒక నర్సు.
ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇంకో నర్సు సహయంతో ఒక నర్సు బుల్లెట్ బండి సాంగ్ పాటకు ఆడి,పాడి పెరాలసిస్ పేషంట్ లో కదలిక తీసుకువచ్చింది.
Read Also : Sexually Assaulting : మైనరు బాలుడ్ని పెళ్లి చేసుకుని కాపురం పెట్టిన 19 ఏళ్ల యువతి
ఓ పాట రోగి మెదడులో ప్రేరణ కలిగించి తద్వారా శరీరంలో కదలిక తీసుకువస్తూ, ఫిజియో థెరపీగా ఉపయోగపడుతోందని కొందరు కామెంట్ చేయగా…పాటే ప్రేరణగా రోగికి ట్రీట్ మెంట్ చేసిన నర్సును పలువురు అభినందిస్తున్నారు. ప్రముఖ గాయని మోహన భోగరాజు ఈ పాటని ఆలపించారు.