Chandrababu Interim Bail Reasons
Chandrababu Interim Bail Reasons: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనకు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. అనారోగ్య కారణాల రిత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ పూర్తిచేసిన హైకోర్టు.. మంగళవారం తీర్పు వెల్లడించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లా ప్రగడ మల్లికార్జునరావు నిబంధనలతో కూడిన మధ్యంతర బెయిల్ నవంబర్ 28 వరకు మంజూరు చేశారు.
Also Read : Ambati Rambabu : చంద్రబాబుకు బెయిల్ రావటంపై మంత్రి అంబటి రాంబాబు ఏమన్నారంటే?
హైకోర్టు షరతులు ఇవే..
– లక్ష రూపాయల చొప్పున బెయిల్ బాండ్, ఇద్దరు షూరీటీలు సమర్పించాలి
– చంద్రబాబు తనకు నచ్చిన ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవచ్చు
– ఎక్కడ ఏ వైద్యం చేయించుకున్నారనే వివరాలు సీల్డ్ కవర్లో జైలు సూపరింటెండెంట్ కు పంపాలి
– కేసుకు సంబంధించిన సాక్షులను ప్రత్యక్షంగానీ, పరోక్షంగానీ ప్రభావితం చేయకూడదు
– నవంబర్ 28న సాయంత్రం 5 గంటలలోపు రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ముందు లొంగిపోయాలి
బెయిల్ మంజూరుకు కారణాలు..
– చంద్రబాబు 73ఏళ్ల వృద్ధుడు కావడం.
– చంద్రబాబుకు కావాల్సిన వైద్య సదుపాయాలు జైల్లో లేఖపోవడం.
– చంద్రబాబు ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించండం.
– గుండె, ఊపిరితిత్తులు వంటి అవయవాలకు పరీక్షలు చేయాల్సి రావడం.
చంద్రబాబు మధ్యంతర బెయిల్ షరతుల్లో మారో 5 అదనపు నిబంధనలు చేర్చాలంటూ హైకోర్టులో సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది.
– రాజకీయ యాత్రలు, ప్రసంగాలు, సభలు చెయ్యకూడదు
– ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇంటర్వ్యూ లు ఇవ్వకూడదు
– కేవలం వైద్యం నిమిత్తమే బెయిల్ ని ఉపయోగించాలి
– ఈ కేసుకు సంబందించిన వివరాలను ప్రెస్ ముందు పబ్లిక్ ముందు మాట్లాడకూడదు
– ఇద్దరు dysp స్థాయి అధికారులను చంద్రబాబుతో వుంటూ కదలికలను కోర్ట్ కి సమర్పించాలి