Ambati Rambabu : చంద్రబాబుకు బెయిల్ రావటంపై మంత్రి అంబటి రాంబాబు ఏమన్నారంటే?

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయి 52 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు బిగ్ రిలీష్ కలిగింది. ఏపీ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తు తీర్పునిచ్చింది.

Ambati Rambabu : చంద్రబాబుకు బెయిల్ రావటంపై మంత్రి అంబటి రాంబాబు ఏమన్నారంటే?

chandrababu bail grant

Chandrababu bail : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయి 52 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ లభించింది. ఏపీ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం ఉదయం తీర్పునిచ్చింది. దీంతో జైల్లో కొన్ని అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ కలిగినట్లైంది. కోర్టు నాలుగు వారాల పాటు నిబంధనలతో కూడిన మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో చంద్రబాబు తరపు లాయర్లు పిటీషన్ వేయగా దానిపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లా ప్రగడ మల్లికార్జునరావు ధర్మాసనం నిబంధనలతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరుచేస్తూ తీర్పు ఇచ్చింది.

Also Read : చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

ఇదిలా ఉంటే చంద్రబాబుకు బెయిల్ వచ్చిన విషయంపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ట్విటర్ లో స్పందించారు. ”చంద్రబాబుకు బెయిల్ వచ్చింది నిజం గెలిచి కాదు బాబుకు కళ్లు కనిపించటంలేదు అని మధ్యంతర బెయిల్ కోర్టు మంజూరు చేసింది” అంటూ సెటైర్లు వేశారు.

కాగా.. చంద్రబాబుకు నవంబర్ 24 వరకూ మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. నిబంధనల్లో భాగంగా కేసుతో సంబంధం ఉన్న వారితో చంద్రబాబు మాట్లాడకూదని, హాస్పటల్ లోనే ఉండాలని.. 24న సాయంత్రం 5 గంటలకు సరెండర్ అవ్వాలని హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావటంతో అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వద్ద టీడీపీ నేతలు సంబరాల్లో మునిగితేలుతున్నారు.