IPL 2020 యాంథమ్ సాంగ్‌ కాపీ కొట్టారు..? ర్యాపర్ KR$NA ఆరోపణలు

  • Publish Date - September 10, 2020 / 02:36 PM IST

IPL 2020 anthem Song-Aayenge hum wapas : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 యాంథమ్ సాంగ్ వివాదాస్పదమైంది.. ర్యాపర్ KR$NA కౌల్ తన రాప్ సాంగ్‌ను కాపీ చేశారంటూ ఆరోపిస్తున్నారు.. ఐపీఎల్ యాంథమ్ సాంగ్ 2017లో తాను కంపోజ్ చేసిన ‘Dekho Kaun Aaya Wapas’ పోలి ఉందని కృష్ణ కౌల్ ఆరోపించారు. ఐపీఎల్ 2020 సెప్టెంబర్ 19న ప్రారంభం కానుంది..




ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్ అబుదాబి వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది.. దీనికి కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఉండటంతో బీసీసీఐ ఐపీఎల్ యాంథమ్ సాంగ్‌ను ‘ఆయెంగే హమ్ వాపాస్’ పేరుతో ఈ సెప్టెంబర్ 6న విడుదల చేసింది.

కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను మేళవిస్తూ ఈ సాంగ్ రూపొందించారు. దీని అర్థం.. మేము తిరిగి ఐపీఎల్‌తో మీ వస్తున్నామనే క్యాప్షన్ ఇచ్చారు.. 93 సెకన్ల వీడియోలో కరోనా వైరస్ మహమ్మారి నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలో అన్ని విషయాలను పొందుపరిచారు.. ఈ వీడియోను ట్విట్టర్ లో 445 వేల వ్యూస్ రాగా.. యూట్యూబ్ లో మరో 15 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.




ఈ ఐపీఎల్ సాంగ్ ఇప్పుడు వివాదాస్పదమైంది. కృష్ణ కౌల్ అనే ర్యాపర్ తన పాటను కాపీ చేశారంటూ ఆరోపిస్తున్నారు. బీసీసీఐ కూడా దీనిపై ఎలాంటి స్పందన రాలేదు. కానీ, ఐపీఎల్ సాంగ్ రూపొందించిన ప్రణవ్ అజయ్ రావ్.. ర్యాపర్ కౌల్ ఆరోపణలను ఖండించారు. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో #IplAnthemCopied అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది..
https://10tv.in/ipl-2020-schedule-released-mumbai-to-face-chennai-in-opener/
మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి చెందిన ఇద్దరు ఆటగాళ్లతో సహా 13 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. వారి పరిస్థితి గందరగోళంగా ఉంది. వ్యక్తిగత కారణాల కారణంగా సురేష్ రైనా, హర్భజన్ సింగ్ టోర్నమెంట్ నుంచి తప్పుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ ఫిజియోథెరపిస్ట్ కూడా కరోనావైరస్ పాజిటివ్ వచ్చింది. అంతేకాదు.. భారత్, చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపిఎల్ 2020 టైటిల్ స్పాన్సర్‌గా VIVOను తొలగించారు. VIVO స్థానంలో Dream11 టైటిల్ స్పాన్సర్‌గా వచ్చింది.




ట్రెండింగ్ వార్తలు