ఏపీలో లిక్కర్ రేట్లలో మార్పులు, ఇవే కొత్త రేట్లు

  • Publish Date - September 3, 2020 / 05:29 PM IST

AP Cheap Liquor Rates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం రేట్లల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఏపీలో మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఐఎంఎఫ్ లిక్కర్, ఫారెన్ లిక్కర్, బీర్, వైన్ ధరల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.150 కంటే తక్కువ ధర ఉన్న మద్యం ధరలను తగ్గించగా.. 90ఎంఎల్‌ రూ.190 నుంచి రూ.600 వరకు ఉన్న మద్యంపై ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. బీర్లు, రెడీ టు డ్రింక్ ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మద్యం దొరకక కొంత మంది శానిటైజర్ తాగుతూ ప్రాణాలు కోల్పోగా… మద్యం ధరలు అధికంగా ఉన్న కారణంగానే మందు బాబులు శానిటైజర్‌‌ తాగారంటూ ప్రభుత్వానికి అధికారులు నివేదికలు ఇవ్వడంతో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఏపీకి మద్యం అక్రమ రవాణా ఎక్కువగా సాగుతుందని, దీని వల్ల ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉందని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

అంతేకాక ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవడంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇవ్వగా.. జీవో నెంబర్ 411 ప్రకారం ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిళ్లు తీసుకురావొచ్చని, జీవోను అమలు చేయాలనీ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇది మందు బాబులకు శుభవార్త అని చెప్పాలి. ఏపీ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మూడు మద్యం బాటిళ్లను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకెళ్లేందుకు అవకాశం ఉండగా.. ఈ క్రమంలోనే రేట్లను తగ్గించారు.