వైరల్ వీడియో.. అందరి హృదయాలను గెలిచిన ఏనుగు పిల్ల.. ప్రేమతో ఏం చేసిందో చూడాల్సిందే..

ఈ వీడియో ఇప్పటికే మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఎంతోమంది తమ మనసులోని భావాలను పంచుకుంటున్నారు.

వైరల్ వీడియో.. అందరి హృదయాలను గెలిచిన ఏనుగు పిల్ల.. ప్రేమతో ఏం చేసిందో చూడాల్సిందే..

Updated On : August 1, 2025 / 9:28 PM IST

ఓ గున్న ఏనుగు ప్రవర్తించిన తీరు అందరి హృదయాలను హత్తుకుంటోంది. దాని ఫ్లాపీ చెవులు, అమాయకమైన చూపులు, ప్రేమతో నిండిన హృదయం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏనుగు పిల్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని అమాయకత్వం, సానుభూతి హృదయాలను కదిలిస్తోంది.

“నేచర్ ఇజ్ అమేజింగ్” అనే ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. దంపతులు పొలంలో సేద తీరుతుండగా ఆ ఏనుగు పిల్ల వారి వద్దకు ప్రేమగా చేరుకుంది. ఏనుగు పిల్ల వెనుక నుంచి నెమ్మదిగా వారి దగ్గరకు వస్తుంది. దంపతులు వెనక్కి తిరిగే లోపే, అది వారి వద్దకు వచ్చేసింది. తన ముందు కాళ్లతో వారిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంది.

ఈ అనుకోని ఘటనతో ఆ దంపతులు నవ్వుతూ, ఆనందంతో మురిసిపోయారు. “బేబీ ఏనుగులు మనుషులతో చక్కగా కలిసిపోతాయి, ఆలింగనం చేసుకోవాలని చూస్తాయి” అని “నేచర్ ఇజ్ అమేజింగ్” ఎక్స్‌ ఖాతాలో క్యాప్షన్ రాశారు.

ఈ వీడియో ఇప్పటికే మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఎంతోమంది తమ మనసులోని భావాలను పంచుకుంటున్నారు. ఆ ఏనుగు ముద్దొస్తోందని కొందరు పేర్కొన్నారు.