Most beautiful airports: ప్రపంచంలోని టాప్‌ 6 మోస్ట్ బ్యూటీఫుల్ ఎయిర్‌పోర్ట్స్‌ ఇవే..

ప్రపంచంలో ఎన్నో అవార్డులు గెలిచిన సింగపూర్ చాంగీ ఎయిర్‌పోర్ట్ మాత్రం ఈసారి జాబితాలో లేదు. ఇది చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Most beautiful airports: ప్రపంచంలోని టాప్‌ 6 మోస్ట్ బ్యూటీఫుల్ ఎయిర్‌పోర్ట్స్‌ ఇవే..

Yantai Penglai International Airport Terminal 2

Updated On : July 28, 2025 / 6:05 PM IST

ప్రతిష్ఠాత్మక ప్రీ వెర్సాయిస్ అవార్డ్స్ 2025 జాబితా వచ్చేసింది. ప్రపంచంలో అత్యంత అందంగా కనిపించే విమానాశ్రయాలకు ఈ అవార్డులు ఇస్తారు. చైనాలోని యాంతాయ్ పెంగ్‌లై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అగ్రస్థానంలో నిలిచింది.

డిజైన్, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ మార్వెట్స్‌ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డులు ఇస్తారు. ఈ సారి ఈ అవార్డులకు  6 విమానాశ్రయాలు ఎంపికయ్యాయి.

2025లో టాప్ 6 అందమైన విమానాశ్రయాలు ఇవే..

యాంతాయ్ పెంగ్‌లై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (చైనా)

  • టెర్మినల్ 2.. 1.67 లక్షల చదరపు మీటర్లు
  • తీరప్రాంత జీవనశైలిని ప్రతిబింబించే డిజైన్
  • మెరిసే గ్లాస్ డోమ్, షిప్ ఆకారంలో అంతర్గత డిజైన్
  • సహజ ప్రకాశంతో నిండిన ఇంటీరియర్ – ఒక సముద్రతీరపు మ్యూజియంలా అనిపిస్తుంది!

Also Read: తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. ఈ రూట్‌లో ప్రయాణించేవారికి 30 శాతం వరకు డిస్కౌంట్‌

మార్సెయ్ ప్రొవెన్స్ ఎయిర్‌పోర్ట్ (ఫ్రాన్స్)

  • 70% పునర్వినియోగ ఉక్కుతో నిర్మాణం
  • విలాసవంతమైన వుడ్ డిజైన్

రోలాండ్ గారోస్ ఎయిర్‌పోర్ట్ (రియూనియన్ దీవి)

  • ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాపికల్ బయోక్లైమాటిక్ ఎయిర్‌పోర్ట్
  • సహజ గాలి ప్రసరణ, స్థానిక మెటీరియల్స్ వాడకం – పర్యావరణానికి అనుకూలంగా నిర్మించారు

కాన్సై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (ఓసాకా, జపాన్)

  • ప్రపంచంలోనే పొడవైన టెర్మినల్
  • జపనీస్ స్టైల్‌కు తోడు ఆధునిక టచ్

పోర్ట్‌లాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (అమెరికా)

  • అడవిలా అనిపించే టెర్మినల్
  •  5,000 చెట్లు, భారీ వుడ్ రూఫ్

శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (అమెరికా)

  • 40% ఎనర్జీ సేవింగ్, సోలార్ ప్యానెల్స్ వాడకం
  • ప్రపంచంలోనే మొదటి ఎయిర్‌పోర్ట్ మ్యూజియం
  • హార్వే మిల్క్‌కు అంకితంగా టెర్మినల్ – సాంస్కృతిక విలువలకు నిలయంగా నిర్మించారు

కాగా, ప్రపంచంలో ఎన్నో అవార్డులు గెలిచిన సింగపూర్ చాంగీ ఎయిర్‌పోర్ట్ మాత్రం ఈసారి జాబితాలో లేదు. ఇది చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.