Viral Video: ఒంటెకు నీళ్లు ఇచ్చి.. దాని ప్రాణాలు కాపాడి..

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Camel

Viral Video – Camel: ఎండల వేడి నుంచి తట్టుకోవడానికి మనుషులు ఎన్నో ముందస్తు చర్యలు తీసుకుంటారు. అయినప్పటికీ ఒక్కోసారి ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఇక మూగ జీవులకు ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో చెప్పే అవసరం లేదు.

కనీసం నీళ్లు దొరకక ఎన్నో మూగజీవులు ఇబ్బందులు పడుతుంటాయి. ఇటువంటి ఇబ్బందులే ఎదురై ప్రాణాపాయ స్థితికి చేరుకుంది ఓ ఒంటె. రోడ్డు పక్కన కదలలేని స్థితిలో కనపడింది ఆ ఒంటె. దీంతో ఓ వ్యక్తి ఒంటె పరిస్థితిని చూసి, దాని వద్దకు వచ్చి నీళ్లు తాగించి, దాని ప్రాణాలు కాపాడాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద ఈ వీడియోను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. వేడికి ఒంటె తట్టుకోలేకపోయిందని కొన్ని నిమిషాలైతే పరిస్థితి చేజారి పోయేదని చెప్పారు.

ఓ డ్రైవర్ దానికి నీళ్లు అందించి, కాపాడాడని తెలిపారు. చాలా దాహంతో ఉన్న ఒంటె నీటిని ఆత్రుతగా తాగిన తీరు అందరి హృదయాలను కలిచి వేస్తోంది. మూగజీవి ప్రాణాలు కాపాడిన ఆ వ్యక్తిపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Viral Video: రైలు ఫుట్ బోర్డులో వేలాడుతూ భయంకర జర్నీ చేసిన బామ్మ.. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వీడియో