Viral Video: రైలు ఫుట్ బోర్డులో వేలాడుతూ భయంకర జర్నీ చేసిన బామ్మ.. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వీడియో

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‭గా మారింది. నెటిజెన్లు ఈ వీడియోను షేర్ చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. దేశంలో ఒకవైపు బుల్లెట్ ట్రైన్ పనులు కొనసాగుతున్నాయి, మరొక వైపు సాధారణ రైళ్లలో ఇదీ దుస్థితి అంటూ విరుచుకుపడుతున్నారు

Viral Video: రైలు ఫుట్ బోర్డులో వేలాడుతూ భయంకర జర్నీ చేసిన బామ్మ.. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వీడియో

Mumbai Local Train: ముంబైలో లోకల్ రైళ్లలో ఉండే రద్దీ తెలిసిందే. ఇసుకే కాదు, నీళ్లు పోసినా ఒక చుక్క కూడా కిందకి రాలనంత రద్దీ ఉంటుంది. రోజూ తమ అవసరాల కోసం ముంబైకర్లు (ముంబై వాసుల్ని అలా పిలుస్తారు) ఈ రద్దీని చేధించి రైలు ప్రయాణం చేస్తుంటారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తరుచూ కనిపిస్తూనే ఉంటాయి. అయితే ముంబై లోకల్ ట్రైనుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. రైలు చాలా వేగంగా వెళ్తోంది. ఫుట్ బోర్డులో ఒక బామ్మ వేలాడుతూ ప్రయాణిస్తోంది. ఆమె వేలాడటం అంటే ఫుట్ బోర్డులో యువత చేసే జర్నీ కాదు. ఆమెకు రైలులో చోటు దొరకక తప్పని పరిస్థితిలో చేసిన ప్రయాణం అది.


దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‭గా మారింది. నెటిజెన్లు ఈ వీడియోను షేర్ చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. దేశంలో ఒకవైపు బుల్లెట్ ట్రైన్ పనులు కొనసాగుతున్నాయి, మరొక వైపు సాధారణ రైళ్లలో ఇదీ దుస్థితి అంటూ విరుచుకుపడుతున్నారు. దేశంలో మొదటి రైలు ప్రారంభమై 160 ఏళ్లు అవుతోంది. ప్రభుత్వమేమో వందే భారత్ వంటి రైళ్లను తీసుకువస్తోంది. ఇప్పటికి ఉన్న రైళ్లలో ప్రయాణికుల అవస్థలు ఇవంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.