Overnight Millionaire
Overnight Millionaire -Chile : కొన్ని పాత వస్తువులు, కాగితాలు చెత్తలో పడేస్తాం. కానీ అందులో కొన్ని విలువైనవి.. జీవితాన్ని మార్చేస్తాయి. ఓ వ్యక్తికి ఇల్లు సర్దుతుంటే చెత్తలో దొరికిన తండ్రి పాస్ బుక్ (Bank Passbook) కోటీశ్వరుడు అయ్యే అవకాశం ఇచ్చింది.
Dream11 Contest : లక్కేలక్కు, కటింగ్ యజమాని కోటీశ్వరుడు..అయినా..వృత్తిని వదులుకోనంటున్నాడు
చిలీకి చెందిన ఎక్సెక్వియెల్ హినోజోసా ఇల్లు శుభ్రపరుస్తున్నాడు. ఏదో గుప్త నిధి దొరికినట్లు చెత్తలో 6 దశాబ్దాల నాటి తండ్రి బ్యాంక్ పాస్ బుక్ దొరికింది. అసలు మ్యాజిక్ అంతా ఆ బుక్‌లోనే ఉందని అతను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు. అది తన తండ్రి పోగొట్టుకున్న పాస్ బుక్. తండ్రికి మాత్రమే ఆ బ్యాంకు ఖాతా గురించి తెలుసు. అతని తండ్రి చనిపోయి 10 సంవత్సరాలు దాటింది. పాస్ బుక్ ద్వారా ఎక్సెక్వియెల్‌కి తెలిసింది ఏంటి అంటే తన తండ్రి 1960-70 లలో రూ. 1.40 లక్షల చిలీ పెసోలను బ్యాంకులో డిపాజిట్ చేశాడని. ఆ డబ్బుతో భవిష్యత్తులో ఇల్లు కొనాలని అనుకున్నాడని. ఆ కల నెరవేరకుండానే అతను కాలం చేశాడు.
అదంతా గతం ఇక పాస్ బుక్ దొరికిన తరువాత ఎక్సెక్వియెల్ ఆ బ్యాంకు గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. పాస్ బుక్‌తో లింక్ అయిన బ్యాంక్ చాలాకాలం క్రితం మూసివేయబడిందన్న విషయం తెలిసి నిరుత్సాహపడ్డాడు. అయితే పాస్ బుక్ మీద బ్యాంక్‌లో జాప్యానికి గురైతే తిరిగి చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కనిపించిన సూచన అతనిలో ఉత్సాహం తీసుకువచ్చింది. ప్రభుత్వాన్ని సంప్రదిస్తే అతనికి సాయం చేయడానికి నిరాకరించింది. అతను ఇక ఈ విషయాన్ని కోర్టుకు తీసుకెళ్లాడు. తన తండ్రి కష్టపడి సంపాదించిన సొమ్ము తమకు చెందాలని వాదించాడు. కోర్టును అన్ని అంశాలను పరిశీలించి ఎక్సిక్వియెల్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. అంతేకాదు 1.2 మిలియన్ డాలర్లకు (సుమారు 10 కోట్ల భారతీయ రూపాయలు) సమానమైన 1 బిలియన్ చిలీ పెసోలను తిరిగి చెల్లించవలసిందిగా ప్రభుత్వానికి సూచించింది.
100 crore credited: ఒక్క రాత్రిలోనే కోటీశ్వరుడైన దినసరి కూలీ.. ఆ తరువాత ఏం జరిగిందంటే?
ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టు మెట్లెక్కింది. అతనికి అక్కడ ఎటువంటి న్యాయం జరుగుతుందో కాలమే చెప్పాలి. అయితే ఒక విషయం మాత్రం అర్ధం చేసుకోవాలి. కొన్నిసార్లు మనకి సామాన్యంగా అనిపించిన వస్తువులు తిరిగి వ్యక్తుల తలరాతను మార్చేస్తాయి. కోర్టు ఎక్సెక్వియెల్‌కి అనుకూలంగా తీర్పు ఇస్తే మాత్రం ఖచ్చితంగా అతను కోటీశ్వరుడు అవుతాడు.