కరోనాపై కలిసి గెలుద్దాం.. పవన్, బన్నీ మిస్ అయ్యారు..

ఇప్పటికే ప్రపంచ దేశాలు అన్ని కరోనా వ్యాధి భయంతో తమ తమ ప్రజలను ఎక్కడికక్కడ ఇళ్లకు పరిమితం చేస్తూ లాక్‌డౌన్ ప్రకటించగా, మన దేశంలో కూడా రాబోయే మే నెల 3వ తేదీ వరకు కూడా లాక్‌డౌన్ ప్రకటిస్తున్నట్లు భారత ప్రధాని మోడీ ప్రకటించారు. ఇక ఈ మహమ్మారి పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడి ప్రజలు అక్కడే తమ ఇళ్లలో ఉండి సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తే తప్పకుండా దీనిని తరిమికొట్టవచ్చని పలువురు సూచనలు జారీ చేస్తున్నారు.
కాగా ప్రజలను ఈ వ్యాధి పట్ల ఎప్పటికప్పుడు చైతన్య వంతులను చేస్తూ, ఈ మహమ్మారి ఎంత ప్రమాదకరమైనదో తెలియచేస్తూ, ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందకు సామాజిక దూరం పాటించాల్సిందే అంటూ ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
మనమందరం కలిసికట్టుగా ఈ మహమ్మారి కరోనాని మన దేశం నుండి తరిమి కొట్టాలని, అలానే ప్రజలందరూ ఎక్కడికక్కడ ఇళ్లలోనే ఉండాలని కోరుతూ తమ ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కలిసి `స్టే హోమ్.. స్టే సేఫ్` పేరుతో ఓ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక్కొక్కరూ ఒక్కో ప్లకార్డు పట్టుకుని ఇచ్చిన వినూత్న మెసేజ్‌ని మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ మెసేజ్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.