PM Kisan 20th Installment : బిగ్ అప్‌డేట్.. పీఎం కిసాన్ రూ. 2వేలు పడేది ఎప్పుడో తెలిసిందోచ్.. ఈ పని పూర్తి చేసిన రైతులకే డబ్బులు..!

PM Kisan 20th Installment : పీఎం కిసాన్ డబ్బుల కోసం చూస్తున్నారా? 20వ విడత వచ్చే జూన్ మొదటివారంలో పడే అవకాశం ఉంది. లబ్ధిదారు రైతులు ఈ పనిచేస్తేనే అకౌంట్లలో డబ్బులు పడతాయి.

PM Kisan Yojana

PM Kisan 20th Installment : పీఎం కిసాన్ లబ్ధిదారులకు బిగ్ అలర్ట్. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 20వ విడత అతి త్వరలో విడుదల కానుంది.
ఈ పథకం కింద విడతలవారీగా కేంద్రం రూ. 2వేలు విడుదల చేసింది.

Read Also : Reliance Jio Plan : జియో బంపర్ ఆఫర్.. 90 రోజుల రీఛార్జ్ ప్లాన్ భలే ఉంది.. ఫ్రీ కాలింగ్, 200GB డేటా.. OTT బెనిఫిట్స్ కూడా!

అందిన సమాచారం ప్రకారం.. వచ్చే జూన్ మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వం 20వ విడత పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేయవచ్చు. అంతకుముందు, ప్రభుత్వం ఫిబ్రవరి చివరి వారంలో వాయిదాల డబ్బును విడుదల చేసింది.

దాంతో 9.8 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. పథకానికి సంబంధించిన అవసరమైన పనులను పూర్తి చేసిన రైతులకు మాత్రమే వాయిదాల డబ్బు అందుతుంది. మీరు అవసరమైన అన్ని పనులు చేయకపోతే రాబోయే విడతకు డబ్బు మధ్యలోనే ఆగిపోతుంది. రైతుల అకౌంట్లలో డబ్బులు జమ కావు. అయితే, రాబోయే పీఎం కిసాన్ 20 విడత వాయిదా తేదీ గురించి ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదని గమనించాలి.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత రూ.2వేల కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నిరీక్షణ జూన్ 7 నాటికి ముగియవచ్చు. ఫిబ్రవరి 24, 2025న 19వ విడత రూ.2వేలు ప్రభుత్వం విడుదల చేసింది. దాదాపు 9.8 కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు.

అర్హత లేని రైతులకు ప్రభుత్వం వాయిదాల చెల్లింపును నిలిపివేసింది. రైతులు DBT ద్వారా డబ్బును అందుకున్నారు. రైతులు రాబోయే 20వ విడత ప్రయోజనాన్ని పొందాలనుకుంటే ముందుగా e-KYC పూర్తి చేయాలి. ఈ పని పూర్తి కాకపోతే మీ బ్యాంకు అకౌంట్లలో డబ్బులు పడవు.

Read Also : Hyundai Electric car : వావ్.. హ్యుందాయ్ కొత్త హైడ్రోజన్ ఎలక్ట్రిక్ కారు.. కేవలం 5 నిమిషాల ఛార్జింగ్‌తో 700కి.మీ రేంజ్..!

పీఎం కిసాన్ e-KYC ఎలా పూర్తి చేయాలి? :

  • రైతులు ముందుగా అధికారిక (PM-Kisan) వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
  • ఆ తర్వాత ‘Kisan Corner’ కి వెళ్లి ‘e-KYC’ ఐకాన్ పై క్లిక్ చేయండి.
  • మీ ఆధార్ నంబర్‌ను అందించి ‘Search’పై క్లిక్ చేయండి.
  • ఆధార్ కార్డుకు లింక్ చేసిన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి ‘OTP’ పై క్లిక్ చేయండి.
  • మీ ఆధార్ కార్డుకు లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
  • మీ e-KYCని పూర్తి చేసేందుకు మీరు OTP ఎంటర్ చేయాలి.